- మీరు 40 సంవత్సరాలు ప్రజలకు సేవ చేయడం చాలా సంతోషంగా ఉంది - అడిషనల్ యస్పి
- మీ రిటైర్మెంట్ లైఫ్ కూడా బాగుండాలని కోరుకుంటున్నా - అడిషనల్ యస్పి (క్రైమ్స్)
- మా సర్వీస్ అంతా ఒక కలలా జరిగిపోయింది, పదవీ విరమణ రోజే అన్నీ రిటైర్మెంట్ బెన్ఫిట్స్ అందించినందుకు ధన్యవాదాలు
శనివారం ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్ నందు ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ సిబ్బంది మొత్తము నలుగురు (1) యస్.ఐ. యం.గంగాధర్, (2) యస్.ఐ. కె.చిట్టి బాబు, పిసిఆర్, (3) ఏఎస్‌ఐ- ఎమ్‌డి.అజంతుల్లా ఖాన్, అనంత సాగరం, (4) ఏఆర్‌ఎస్‌ఐ- ఎస్‌డి.మహబూబ్ బాషా, డిఏఆర్ ను జిల్లా అడిషనల్ యస్.పి (అడ్మిన్) పి.వెంకటరత్నం, అడిషనల్ యస్.పి.(క్రైమ్స్) పి.మనోహర్ రావు, ఇతర అధికారులు, పోలీసు అసోసియేషన్ సంఘ సభ్యులు, పోలీసు కుటుంబాల సమక్షంలో ఘనముగా సన్మానం చేసి జ్ఞాపికతో మరియు పూలమాలలతో సత్కరించడం జరిగినది.ఈ కార్యక్రమంలో అడిషనల్ యస్పి(అడ్మిన్) మాట్లాడుతూ ఆరోగ్యం కాపాడుకోవాలని, మీరంతా 40 సంవత్సరాలు వరకు సర్వీస్ చేసారు చాలా సంతోషంగా ఉందని, పదవీ విరమణ రోజే అన్నీ రిటైర్మెంట్ బెన్ఫిట్స్ అందిందాము, మిగిలినవి త్వరలోనే అందిస్తామని, పదవీ విరమణ చేయుచున్న వారంతా నా తల్లిదండ్రులతో సమానం అని, మనమంతా కూడా ఒకే పోలీసు కుటుంబమని తెలిపారు. ఈ రోజు పదవీ విరమణ పొందిన అధికారులు అందరూ ఎప్పుడైనా ఎలాంటి అవసరం వచ్చినా, అన్నీ విధాలా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా అడిషనల్ యస్.పి.(క్రైమ్స్) మాట్లాడుతూ మీ రిటైర్మెంట్ లైఫ్ కూడా సంతోషంగా గడపాలని, కుటుంబ సభ్యులు ఈ రోజు నుండి వారి తల్లిదండ్రులను అన్ని విధాలా ఆదరిస్తూ, ప్రేమతో చూసుకోవాలని తెలిపారు. అనంతరం పదవీ విరమణ అధికారులు మాట్లాడుతూ మా సర్వీసు అంతా ఇప్పుడు చూస్తుంటే ఒక కలలా ఉందని, సమయానికి విధులకు వచ్చి, పై అధికారుల ఆదేశాలు పాటిస్తే అందరికీ అలాగే ఉంటుందని తెలిపారు. అధికారులందరూ కలిసి పదవీ విరమణ పొందిన వారిని పోలీస్ బ్యాండ్ వాయిద్యాల మధ్య స్వయంగా కుటుంబ సభ్యులందరినీ వారి ఇంటి వద్ద క్షేమంగా చేర్చుటకు వాహనాలు ఎక్కించి ఘనంగా వీడ్కోలు పలికారు.ఉద్యోగ విరమణ పొందిన అధికారులకు నెల్లూరు జిల్లా పోలీస్ సిబ్బంది అందరి తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు, శుభాకాంక్షలను ఏఓ, మహిళా పి.యస్. ఎ.ఆర్. డిఎస్పి తెలియపర్చినారు. ఈ కార్యక్రమానికి పోలీసు అసోసియేషన్ సంఘ అద్యక్షులు మద్దిపాటి ప్రసాద్ రావు అధ్యక్షత వహించగా, ఆర్‌ఐ వెల్ఫేర్, పదవీ విరమణ పొందుతున్న అధికారుల కొడుకులు-కుమార్తెలు ఉన్నత ఉద్యోగాలలో ఉండడం సంతోషకరమైన విషయమని, వీరి జీవితం ఆనందమయంగా సాగిపోవాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు అందజేశారు.
Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.