మొలకల పూడి గ్రామంలో కరోనా వైరస్ మందులు పంపిణీ
చిట్టమూరు ఫిబ్రవరి 8: పలు రకాల వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండి పరిసరాలను ,పరిశుభ్రంగా ఉంచుకొని ,వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉంటే, ఎలాంటి వ్యాధులు దరిచేరవని ఆరోగ్యవంతులుగా ఉండవచ్చునని ఎం వి రావు పౌండేషన్ ఛైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ తెలిపారు.శనివారం చిట్టమూరు మండలం మొలకల పూడి గ్రామం లోని అంగన్వాడి కేంద్రం వద్ద విద్యార్థులకు ,గ్రామస్తులకు కరోనా వైరస్ పట్ల అవగాహన కల్పించి ,అనంతరం మూడు రోజులకు సరిపడా హోమియో మందులను కోట మండలం విద్యానగర్ గ్రామానికి చెందిన విద్యా ప్రదాత, ఉత్తమ అధ్యాపకులు, స్వర్గీయ పాఠశాల ముప్పవరపు వెంకటేశ్వరరావు పేరిట ఏర్పాటయిన ఎం.వి రావ్ పౌండేషన్ మరియు శంకర్ ట్రస్ట్ నిర్వాహకులు హోమియో మందులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా లీలా మోహన్ కృష్ణ మాట్లాడుతూ కరోనా పట్ల ప్రజలు భయాందోళన చెందుతున్నారని సామాజిక మాధ్యమాల వల్ల మరింత భయపడుతున్న విషయం అందరికీ తెలుసునని ఈ వైరస్ వ్యాప్తి చెంది ఉన్నది వాస్తవమేనని దీనికి తగిన జాగ్రత్తలు తీసుకుంటే మన ప్రాంతానికి ఎలాంటి వ్యాధులు దరిచేరవని ముందు జాగ్రత్త చర్యగా అర్సోనికం ఆల్బమ్స్ 30 అనే హోమియో మందులను ప్రతిరోజు పరగడుపున కానీ భోజనం చేయక ముందు కానీ మూడు రోజులు క్రమం తప్పకుండా వాడి మాంసాహారం తినకుండా, జలుబు దగ్గు పట్ల జాగ్రత్తలు పాటిస్తే ,కరోనా వైరస్ వల్ల ప్రమాదం లేదని ఆయన అన్నారు.
అనంతరం మొలకల పూడి గ్రామం లోని అంగన్వాడీ కేంద్రాల పరిధిలోని చిన్నారులకు గ్రామస్తులకు ముందస్తు జాగ్రత్తగా ఉపయోగపడే మందులను పంపిణీ చేసి వాటిని గ్రామస్తులకు మూడు రోజుల పాటు వేయాలని అంగన్వాడీ కార్యకర్తలను లీలా మోహన్ కృష్ణ కోరారు.
ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, కళ్యాణి ,విద్యార్థుల తల్లిదండ్రులు ,పాల్గొన్నారు.
Post a Comment