సివిల్ వ్యవహారాలలో జోక్యం చేసుకోవద్దు, అవసరమైతే రెవిన్యూ, న్యాయ సలహాలు తీసుకోండి - యస్పి
క్రిమినల్ కేసులలో దర్యాప్తు వేగవంతం చేయండి, నిందితులకు కఠిన శిక్షలు పడాలి, అలసత్వం ప్రదర్శించరాదు
కోర్టు ఉత్తర్వులు ఇచ్చిన వెంటనే భాధితులకు సత్వర న్యాయం చేయండి
జిల్లా వ్యాప్తంగా స్పందనకు ఈ రోజు మొత్తం "138" ఫిర్యాదులు
జిల్లా యస్పి భాస్కర్ భూషణ్ జిల్లా పోలీసు కార్యాలయంలో ఉదయం 10.30 గంటల నుండి మధ్యాహ్నం 03.00 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న "స్పందన" కార్యక్రమంనకు అందిన పిర్యాదులను 7 రోజులలోగా పరిష్కరించాలని, అన్నీ పోలీసు స్టేషన్ లు, సర్కిల్ మరియు యస్.డి.పి.ఒ. ఆఫీసు లలో జరుగుతున్న స్పందన కార్యక్రమంను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షిస్తూ, వెంటనే వారి సమస్యల పై అక్కడి అధికారులతో లైవ్ లో మాట్లాడుతూ తగిన ఆదేశాలు జారీ చేసినారు.స్పందనకు జిల్లా నలుమూలల నుండి యస్పి స్పందన కార్యక్రమానికి మొత్తం 115 మంది ఫిర్యాదుదారులు హాజరుకాగా, అన్నీ సబ్ డివిజన్ స్థాయిలో మరో 23 ఫిర్యాదులు అందినవి. ఈ రోజు వచ్చిన ఫిర్యాదులలో భూతగాదాలు, భార్యా భర్తల గొడవలు, వృద్ద తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్న సంతానం, మిస్సింగ్ కేసుల అర్జీలు ఎక్కవగా ఉన్నవి. అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన యస్పి వాటిని సంబంధిత అధికారులకు ఎన్టార్స్ చేయుచూ, వేధింపులకు గురి అయిన తల్లిదండ్రులు ఇచ్చే కేసుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అదేవిధంగా క్రిమినల్ కేసులలో దర్యాప్తు వేగవంతం చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే అమలు చేసి భాదితులకు న్యాయం చేయాలని, మహిళలు, బాలలు, వృద్ధుల రక్షణకు పూర్తి భరోసా, భద్రత కల్పించాలని, అదేవిధంగా సివిల్ వ్యవహారాలలో జోక్యం చేసుకోరాదని, అవసరం మేరకు ఎప్పటికప్పుడు జిల్లా న్యాయ సేవ అధికారిక సంస్థ రెవిన్యూ సేవలు కూడా వినియోగించుకోవాలి అని సూచించారు. స్పందన కార్యక్రమానికి యస్పితో పాటు అడిషనల్ యస్పి(క్రైమ్స్) పి.మనోహర్ రావు, నెల్లూరు టౌన్ డియస్పి జె.శ్రీనివాస రెడ్డి, రూరల్ డియస్పి కె.వి.రాఘవ రెడ్డి, యస్.బి డియస్పి యన్.కోటారెడ్డి హాజరుగా ఉన్నారు.
Post a Comment