- కమిషనర్ పివివిస్ మూర్తి
నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో వార్డు సచివాలయ కార్యదర్శులకు అందిస్తున్న శిక్షణలో బాధ్యతగా వ్యవహరించి ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని కమిషనర్ పివివిస్ మూర్తి సూచించారు. కొడవలూరు మండలం, రామన్న పాలెంలోని ఆదిశంకరా ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న శిక్షణా తరగతులను కమిషనర్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వార్డు కార్యదర్శుల శిక్షణకై ప్రాంగణంలో అన్ని వసతులను ఏర్పాటు చేసామని, రెండు వారాల పాటు శిక్షణా తరగతులు జరిగేలా పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు. స్వచ్ఛమైన మంచినీరు, నాణ్యమైన భోజనం, సౌకర్యవంతమైన విశ్రాంతి గదులను కేటాయించి నిష్ణాతులైన బోధనా సిబ్బందితో వివిధ విభాగాల్లో శిక్షణ అందిస్తున్నామని ఆయన తెలిపారు. ఎమర్జెన్సీ వైద్య సేవలను సైతం సంసిద్ధం చేసామని, శిక్షణా కాలం పూర్తయేవరకు కార్యదర్శులు తప్పనిసరిగా
ప్రాంగణంలోనే ఉండాలని కమిషనర్ ఆదేశించారు. వార్డు కార్యదర్శులంతా ఉత్తమ శిక్షణ పొంది, విధి నిర్వహణలో ప్రతిభ చూపాలని ఆయన ఆకాంక్షించారు. శిక్షణా కాలంలో కార్యదర్శులంతా క్రమశిక్షణగా మెలుగుతూ బోధకుల నుంచి సమగ్ర సమాచారాన్ని పొందాలని సూచించారు.
Post a Comment