అంతర్జాతీయ స్థాయి క్రీడా ప్రాంగణాల ఆధునీకరణకు చర్యలు


రాష్ట్రంలో ప్రతిభ వున్న క్రీడాకారులను ప్రోత్సహించడానికి అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో క్రీడా ప్రాంగణాలను ఆధునీకరించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర క్రీడలు, పర్యాటక, సాంస్కృతిక యువ జనాభివృద్ధి శాఖా మాత్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు.శనివారం ఉదయం పొదలకూరు మండల కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ బాలుర హైస్కూలు ప్రాంగణంలో ఎ.పి. సి.ఎం. కప్ స్టేట్ లెవల్ బాల్ బాడ్మింటన్ క్రీడా పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర క్రీడలు, పర్యాటక, సాంస్కృతిక మరియు యువజనాభివృద్ధి శాఖా మాత్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి స్వతహాగా క్రీడాకారుడు కావడం వలన రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారన్నారు. తల్లిదండ్రులు సైతం విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ముఖ్యమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. గ్రామీణ, మండల స్థాయిక్రీడాకారులను ప్రోత్సహించుట కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జిల్లాకు ఒక క్రీడ వంతున సి.ఎం. కప్ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలను నిర్వహించడం జరుగుతున్నదన్నారు. రాష్ట్రంలో క్రీడాకారులను ప్రోత్సహించడం కోసం క్రీడల్లో గోల్డ్ మెడల్ సాధించిన వారికి రూ. 5 లక్షలు, సిల్వర్ మెడల్ సాధించిన వారికి రూ. 2.5 లక్షలు, బ్రాంజ్ మెడల్ సాధించిన వారికి లక్ష రూపాయలు అందించడానికి 2 కోట్లు రూపాయలు కేటాయించిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ క్రీడా ప్రాంగణాలు అవసరమో గుర్తించి క్రీడా ప్రాంగణాల నిర్మాణాలకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి తెలిపారు. పొదలకూరులో అసంపూర్తిగా వున్న కాకాణి రమణా రెడ్డి క్రీడా ప్రాంగణం పనులు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం దేశచరిత్ర ఎక్కడాలేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు మంత్రి శ్రీనివాసరావు తెలిపారు.జిల్లా కలెక్టరు ఎం.వి. శేషగిరిబాబు మాట్లాడుతూ, క్రీడల యొక్క ప్రాముఖ్యతను దృష్టిలో వుంచుకొని, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గాల వారిగా క్రీడా వికాస కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నెల్లూరు నగరానికి దగ్గర్లోమొగళ్ల పాలెం వద్ద 20 కోట్ల రూపాయలతో క్రీడా ప్రాంగణాన్ని కూడా నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. క్రీడల వలన యువతకు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం పెంపుదల అయ్యి, జీవితంలో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి అవకాశముంటుందన్నారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget