-ఇంచార్జ్ ఎడిసి ప్రసాద్
జగనన్న వసతి & విద్యా దీవెన పధకానికి అర్హులైన విద్యార్థుల కార్డులను వార్డు వలంటీర్ల ద్వారా పంపిణీ చేయనున్నామని నగర పాలక సంస్థ ఇంచార్జ్ అడిషనల్ కమిషనర్ ఏ. ప్రసాద్ తెలిపారు. వార్డు ఎడ్యుకేషన్ & డేటా ప్రాసెసింగ్ కార్యదర్శులకు కార్యాలయంలోని సమావేశ మందిరంలో పధకం కార్డులను గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవశకం సర్వే ద్వారా వార్డు వలంటీర్లు అర్హులుగా గుర్తించిన విద్యార్ధులందరికీ కార్డుల పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. నవరత్నాల పధకాల్లో "జగనన్న విద్యా దీవెన" ద్వారా పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ అందుతోందని, భోజనం, వసతులకోసం "జగనన్న వసతి దీవెన" పధకం ఉపయుక్తంగా ఉందని పేర్కొన్నారు. అర్హులైన ఐటిఐ విద్యార్థులకు ఏడాదికి రూ.10,000 చొప్పున, పాలిటెక్నిక్ విద్యార్థులకు ఏడాదికి రూ.15,000 చొప్పున, డిగ్రీ ఆపై కోర్సులు చదివే విద్యార్థులకు రూ.20,000 వంతున రెండు విడతలుగా అకౌంట్లో జమ అవుతోందని తెలిపారు.
Post a Comment