కిషోర్స్ రత్నం విద్యాసంస్థల ఆనంద విహారి వార్షికోత్సవ వేడుకలు


నెల్లూరు నగరము సరస్వతినగర్‌లోని డాక్టర్‌ కిషోర్స్ రత్నం ఎలైట్ ఒలంపియాడ్ , మెడికల్ ఒలంపియాడ్, టెక్నో ఇఐఐటి స్కూల్స్ “ఆనందవిహారి" వార్షికోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు. విద్యాసంస్థల డైరెక్టర్లు డాక్టర్‌ కృష్ణకిషోర్‌ వాసంతి కిషోర్‌ ముఖ్య అతిధులుగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన గావించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరు విద్యాసంస్థల చరిత్రలో మరెక్కడ లేని విధంగా ఈ కార్యక్రమమును డాక్టర్‌ కిషోర్స్ రత్నం సూల్స్ "ప్లానింగ్ మెనేజ్ మెంట్ క్లబ్" 13 సం||వయస్సు లోపల విద్యార్ధులు నిర్వహిస్తున్నారని తెలియజేసారు. విద్యారంగంలో 16 వసంతాలు పూర్తిచేసుకొని, ప్రతి సం|| నూతన ప్రణాళికలతో, విధి విధానాలతో విద్యార్ధుల సర్వతో ముఖాభివృద్ధికి అవసరమైన, అనుగుణమైన కార్యక్రమాలను రూపొందించి తగిన రీతిలో నిర్వహిస్తున్నామన్నారు. ఈ విద్యా సంవత్సరములో టెడ్ ఎడ్, శాప్, రీడింగ్, సైన్స్ రీసెర్చ్, ధియేటర్ అండ్ ఆర్ట్స్ క్లబ్ ఏక్టివిటీ టైమ్ జోన్ ప్రవేశపెట్టమని తెలియజేశారు.ఈ వార్షికోత్సవంలో విద్యార్ధులు విభిన్న నృత్యరీతులను ప్రదర్శించారు. రైతుల సమస్యలు-వారి గొప్పతనం, యువతుల స్వాతంత్ర్యం-రక్షణ, రామకథ, స్వాతంత్ర్య సమరయోధులు, పల్లెటూళ్ళ గొప్పతనము, వివిధ అంశాలపైన నృత్యరీతులు ఆహుతులను అలరించాయి.ఈ సందర్భంగా డాక్టర్‌ కిషోర్స్ రత్నం విద్యాసంస్థల జనరల్ మేనేజర్ రామ్మూర్తి నాయుడు, మేనేజర్లు, రాజేష్ బాబు, అజయ్ సింగ్, జితేంద్రనాథ్ రెడ్డి, ప్రిన్సిపాల్స్ రేవతి, మణిమాల, ప్రపూర్ణ , ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు కోఆర్డినేటర్ ప్రిసిల్లా, తల్లిదండ్రులు విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.




Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget