నెల్లూరు జిల్లా సూపరింటెండెంట్ అఫ్ పోలీస్, భాస్కర్ భూషణ్ వారి ఉత్తర్వుల మేరకు నెల్లూరు పట్టణంలో ప్రభుత్వ నిషేదిత పదార్ధాలైన, ప్రాణాలకు హాని కలిగించే గంజాయిని ప్రభుత్వ ఆదేశాలకు వ్యతిరేఖంగా అక్రమ రవాణా చేస్తున్న టువంటి ముద్దాయిలను నెల్లూరు నగర సబ్ డివిసినల్ పోలీస్ ఆఫీసర్ జె.శ్రీనివాసులు రెడ్డి వర్యవేక్షణలో, చిన్నబజారు పి.యస్. సి.ఐ అయిన ఎమ్.మధుబాబు వారి సిబ్బందితో కలిసి నెల్లూరు నగరంలో మద్రాస్ బస్ స్టాండ్ సమీపంలోని మురళి కృష్ణ 70 ఎమ్‌ఎమ్ హోటల్ ముందు అరెస్టు చేసి, వారి వద్ద నుండి నిషేదిత గంజాయిని స్వాధీన పరచుకున్నారు. ముద్దాయిలను విదారించగా మొదటి
నిందితురాలు గతంలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్నందుకు నెల్లూరు, పాడేరు, చోడవరం పోలీస్ స్టేషన్ల నందు ఇది వరకే పట్టుపడి జైలుకు వెళ్లి ఉన్నట్లు, 15 రోజుల క్రితం బెయిల్ పై విడుదలైన ఆమె తన వియ్యంకురాలుతో కలసి తిరిగి విశాఖపట్నము ఏజెన్సీ ప్రాంతమైన పాడేరు దాని చుట్టు ప్రక్కల ప్రాంతాలలో సుమారు 22 కేజీల గంజాయిని కొనుగోలు చేసి అక్రమంగా తమ వూరికి తరలిస్తూ, మార్గం మధ్యలో నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ నందు కండిషన్ బెయిల్ పై పోలీస్ వారి ఎదుట గురువారం హాజరు కావలసి ఉన్నందున ప్రయాణ బడలికతో నెల్లూరులోని ఏదో ఒక లాడ్జిలో తల దాచుకుందామని ఆటోలు ఆపుతుండగా సి.ఐ,
వారి సిబ్బంది మధ్యవర్తుల సమక్షంలో వారిని పట్టుకుని విచారించి అరెస్టు చేసి, వారి ఉన్న 22 కేజీల గంజాయి, 2- సెల్ ఫోన్లు, నగదు రూ.1450 వారు ప్రయాణించిన ట్రైన్, బస్సు టికెట్స్ ను తదుపరి దర్యాప్తు నిమ్మితం స్వాధీనము చేసుకొనడమైనది.ముద్దాయిలను పట్టుకునేందుకు చాకచక్యంగా ప్రవర్తించిన అధికారులు మరియు సిబ్బందిని నెల్లూరు నగర సబ్ డివిసినల్ పోలీస్ ఆఫీసర్ జె.శ్రీనివాసులు రెడ్డి ప్రశంసించారు.
Post a Comment