నారాయణ నర్సింగ్ ఇన్స్టిట్యూషన్స్ వారు నర్సింగ్ విద్యార్ధులను చక్కటి ప్రణాళికలతో, విజ్ఞానవంతమైన సేవాభావం కలిగిన నర్సులుగా జాతికి అందించడం అభినందనీయమని డా|| ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి డా|| పి.శ్యామప్రసాద్ అన్నారు. నారాయణ నర్సింగ్ ఇన్స్టిట్యూషన్స్ 15వ పట్టభద్రుల దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిధిగా ఆయన పాల్గొని నర్సింగ్ విద్యలో అత్యుత్తమ ప్రమాణాలు పాటిస్తూ జాతీయస్థాయిలో ఒక ప్రత్యేకతను చాటుకోవడమే కాకుండా నర్సింగ్ సేవలను అందించే విధంగా బోధన చేస్తున్నందుకు నారాయణ నర్సింగ్ ఇన్స్టిట్యూషన్స్ యాజమాన్యానికి, సిబ్బందికి ప్రత్యేక అభినందనలు
తెలియజేశారు. నర్సింగ్ విద్యలో అవసరమైనటువంటి అనుభవజ్ఞులైన బోధనా సిబ్బంది సదుపాయాలతోపాటు అందుబాటులో నారాయణ హాస్పిటల్ కూడా ఉండడం కారణంగా విద్యార్థులు మరింత విజ్ఞానాన్ని సాధిస్తున్నారని అన్నారు.నారాయణ నర్సింగ్ విద్యార్థులు యూనివర్శిటీ పరిధిలో మొదటి ర్యాంకు 5మంది, రెండవ ర్యాంకు 43 మంది బీఎస్సీ నర్సింగ్ లో సాధించారు. పి.పి. బీఎస్సీ ఎమ్మెస్సీ నర్సింగ్ లో కూడా అత్యుత్తమ ప్రతిభను కనబరచడం జరిగిందన్నారు. గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా ప్రతిభ కనబరిచిన నర్సింగ్ విద్యార్థులందరికీ ప్రత్యేక ప్రశంసా పత్రాలు, బహుమతులు అందజేశారు. నర్సింగ్ విద్యార్థులను ఉద్దేశించి
ఉపకులపతి డా|| పి.శ్యామప్రసాద్ మాట్లాడుతూ రోగుల పట్ల అంకితభావంతో మరీ ముఖ్యంగా రోగులంతా కూడా తమ సమీప బంధువులుగా భావించి వైద్య సేవలు అందించాలని ఆయన కోరారు.నారాయణ మెడికల్ గ్రూప్ అకడమిక్ కో-ఆర్డినేటర్ డా|| సర్వేపల్లి విజయకుమార్ మాట్లాడుతూ నారాయణ నర్సింగ్ ఇన్స్టిట్యూషన్స్ దక్షిణ భారతదేశంలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్న కారణంగా నర్సింగ్ విద్యను అభ్యసించేందుకు దక్షిణ భారతదేశం నుంచే కాకుండా ఉత్తర భారతదేశం నుంచి కూడా ఎంతో మంది విద్యార్థులు నర్సింగ్ విద్య కొరకు నారాయణ నర్సింగ్ ఇన్స్టిట్యూషన్కు రావడం గర్వించదగ్గ విషయమన్నారు. చక్కటి ప్రణాళికలతో అత్యుత్తమ బోధన అందిస్తున్న నారాయణ నర్సింగ్ బోధనా సిబ్బందికి యాజమాన్యం తరపున అభినందనలు తెలియజేశారు.నారాయణ నర్సింగ్ కళాశాల డీన్ డా|| ఎస్.ఇందిర మాట్లాడుతూ నారాయణ నర్సింగ్ కళాశాల విద్యార్థులు యూనివర్శిటీ స్థాయిలో సాధించిన ఫలితాలే నారాయణ నర్సింగ్ ఇన్స్టిట్యూషన్స్ అవలంభిస్తున్న అత్యుత్తమ బోధనా ప్రమాణాలకు నిదర్శనమని తెలిపారు. ఈ రోజు నర్సింగ్ విద్యార్థులకు ఒక చక్కటి ప్రణాళికతో బోధనను అందించడం ద్వారా వారు సేవా, నైపుణ్యంతో అత్యుత్తమ సేవలందిస్తున్నారని, అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలలో నారాయణ నర్సింగ్ విద్యార్థులు సేవలందించడం విశేషమన్నారు. మాకు అవసరమైనటువంటి అన్ని రకాల వైద్య ప్రమాణాలు అందిస్తున్న నారాయణ విద్యాసంస్థల చైర్మన్ డా|| పొంగూరు నారాయణకి మరియు డా|| ఎన్టీఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వారికి నారాయణ నర్సింగ్ కళాశాలల తరపున ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో నారాయణ మెడికల్ కళాశాల డీన్ డా|| సూర్యప్రకాశ్ రావు, సీఈవో డా|| ఎస్.సతీష్ కుమార్, నారాయణ డెంటల్ కళాశాల ప్రిన్సిపాల్ డా|| అజయ్ రెజినాల్డ్, నారాయణ హాస్పిటల్ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ డా|| బిజురవీంద్రన్, మెడికల్ అడ్మినిస్ట్రేటర్ డా॥ వై.వి ప్రభాకర్, నారాయణ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ జయంతి, శ్రీనారాయణ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ వనజకుమారి, వైస్ ప్రిన్సిపాల్ డా|| రాజేశ్వరి, బోధనా మరియు బోధనేతర సిబ్బంది, విద్యార్థులు అలాగే ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మణిపూర్ రాష్ట్రాల నుంచి విచ్చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఈ గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా ఏర్పాటుచేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.
Post a Comment