ఓ మంచి ఆలోచన లక్షలాది మందిని కదిలిస్తుంది, లక్షలాదిమందిలో కదలిక ఒక సమాజాన్ని కదిలిస్తుందని ఆత్మకూరు తహశీల్దారు వై. మధుసూదన్ రావు పేర్కొన్నారు. నెహ్రూ యువకేంద్ర ఆధ్వర్యంలో.. సోమవారం ఆత్మకూరులోని డాక్టర్ ఎస్ ఆర్ జె డిగ్రీ కాలేజ్ నందు ఆత్మకూరు బ్లాక్ స్థాయిలో "యూత్ క్లబ్ డెవలప్మెంట్ కన్వెన్షన్" కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత సమాజహితం కోసం నూతన యువజన సంఘాలు ఏర్పాటు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉన్నది. కొంతమంది యువకులు ఒక క్లబ్బుగా ఏర్పడి సమస్యలను సమన్వయంతో పరిష్కరించగలరని తెలియజేశారు. నెహ్రూ యువకేంద్ర డిస్ట్రిక్ట్ యూత్ కోఆర్డినేటర్ ఆకుల మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం నూతన యువజన సంఘాలు ఏర్పాటు చేయడం కోసం, సమాజంలోని గ్రామ స్థాయి నుండి ప్రాతినిధ్యం వహించగలిగే విధంగా ఎదగాలి. నిద్రాణమైన యూత్ క్లబ్బులను సక్రమం చేయడానికి దోహదపడుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో తొలుత.. స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో.. పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కె. మురళీమోహన్ రాజు, ప్రిన్సిపల్ పి. శ్రీనివాసులరెడ్డి, కరస్పాండెంట్ ఎస్. రాధాకృష్ణ, వైస్ ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, రిసోర్స్ పర్సన్ టి. వెంకటేశ్వర్లు, లెక్చరర్ మోహనరావు, విద్యార్దులు, యువత తదితరులు పాల్గొన్నారు.
Post a Comment