లోక్సభలో నెల్లూరు ఎంపీ ఆదాల ప్రశ్న
దేశంలోని వివిధ రాష్ట్రాలు, సంస్థలు, వ్యక్తుల నుంచి స్వీకరించిన సలహాలు, సూచనలతో కొత్త జౌళి విధానం రూపుదిద్దుకుందని కేంద్ర జౌళి శాఖ మంత్రి జుబిన్ ఇరానీ స్పష్టం చేశారు. శుక్రవారం లోక్సభలో నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, కొత్త విధానం గురించి అడిగిన ప్రశ్నకు రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. జౌళి శాఖ ద్వారా 2.01 నుంచి 11.2 శాతం వరకు జీడీపీ లభిస్తోందని తెలిపారు. 45 కోట్లకు పైగా వ్యక్తులు ఈ రంగంలో ఉపాధి పొందుతున్నారని ,మరో ఆరు కోట్లమంది అనుబంధ రంగాల్లో ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలవారు, మహిళలు దీనిపై ఆధారపడి ఉన్నారని తెలిపారు. 2018- 19 ఎగుమతుల వాటా 12 శాతం అని పేర్కొన్నారు. జాతీయ చేతివృత్తుల అభివృద్ధి పథకం కింద ఈ రంగంలోని పలు విభాగాలకు ఆర్థిక సహాయం లభిస్తుందని, తద్వారా ఈ రంగం ఎంతో అభివృద్ధిని సాధిస్తుందని పేర్కొన్నారు.
Post a Comment