మానవత్వం చాటుకున్న నవాబుపేట సీఐ వేమారెడ్డి
*మతిస్థిమితం లేని మహిళను చేరదీసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి పంపించిన వైనం*
*మతిస్థిమితం లేని ఆమెను భర్తకు క్షేమంగా అప్పగించడం పట్ల కృతజ్ఞతలు తెలిపిన మహిళ భర్త*
నగరంలోని నవాబుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వేమారెడ్డి తన మానవత్వాన్ని చాటుకున్నారు. శనివారం డయల్ 100కు ఓ ఫోన్ కాల్ వచ్చింది.ఓ మహిళ రామచంద్రపురం ఏరియాలో అనుమానాస్పద స్థితిలో ఉన్నట్లు కొందరు కాల్ చేసి చెప్పారు.దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న నవాబుపేట పోలీసులు ఆ మహిళను అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కు తీసుకొచ్చారు.అయితే ఆ మహిళకు మతిస్థిమితం లేక అలా ప్రవర్తించినట్లు తెలుసుకున్న సిఐ వేమరెడ్డి మహిళ ఇచ్చిన ఆధారాల ఆధారంగా చాలా కష్టపడి ఆధారాలు సేకరించి ఆమె భర్త కు ఫోన్ చేసి పిలిపించి అప్పగించడం జరిగింది. గత కొంత కాలం నుండి మతిస్థిమితం సరిగా లేక అలా ప్రవహిస్తున్నట్లు భర్త చెప్పారు.నెల్లూరులో అనేక చోట్ల చూపించిన ఆమెకు మతిస్థిమితం సరిగా ఉండటం లేదని భర్త తెలిపాడు.త్వరలోనే హైదరాబాద్ ఎర్రగడ్డ హాస్పిటల్ కు తీసుకుపోతున్నట్లు తెలిపారు.జాగ్రత్తగా చూసుకోవాలని సరైన వైద్యం అందించాలని సీఐ సలహా ఇచ్చారు. మతిస్థిమితం లేని మహిళ భర్త పోలీస్ స్టేషన్కు వచ్చే వరకు ఆమెకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని వసతులు కల్పించిన వేమారెడ్డి ని ఇబ్బంది.. ప్రజలు అభినందించారు.
Post a Comment