'స్పందన' కార్యక్రమంను నిర్వహించిన జిల్లా యస్పి


నెల్లూరు, ఫిబ్రవరి 03, (రవికిరణాలు) : “స్పందన” కార్యక్రమంనకు అందిన పిర్యాదులను నిర్దేశించిన గడువులోగా పరిష్కరించాలని జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న “స్పందనను” వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా యస్పి భాస్కర్ భూషణ్ లైవ్ లో పర్యవేక్షిస్తూ సోమవారం స్పందన కార్యక్రమం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించారు. అన్నీ పోలీసు స్టేషన్ లు, సర్కిల్ యస్.డి.పి.ఒ. ఆఫీసు లలో జరుగుతున్న స్పందన కార్యక్రమం కూడా జిల్లా యస్పి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షిస్తూ, కావలి రూరల్ సర్కిల్ ఆఫీస్ లో ఉన్న కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పోలీస్ క్వార్టర్స్ శిధిలావస్థ, ట్రాఫిక్ సిగ్నల్స్ తో పాటు 
నియోజక వర్గం సమస్యలు మాట్లాడగా వెంటనే యస్పి అన్ని పరిష్కరిస్తామని, సమస్య జరిగిన వెంటనే కేసు నమోదు చేయాలని, కేసులను సత్వరం చట్టపరంగా పరిష్కరించాలని, మహిళా పోలీసుల సేవలు ప్రజలు వినియోగించుకోవాలని తెలుపుతూ కొద్ది సేపు సంభాషించారు. స్పందనకు జిల్లా నలుమూలల నుండి యస్పి స్పందన కార్యక్రమానికి మొత్తం 107 మంది ఫిర్యాదుదారులు హాజరుకాగా, అన్నీ సబ్ డివిజన్ స్థాయిలో మరో 17 ఫిర్యాదులు అందినవి. ఈ రోజు వచ్చిన ఫిర్యాదులలో ఎస్సి/ఎస్టి కేసులలో ముద్దాయిలపై చర్యలు, దొంగతం కేసులలో సొత్తు రికవరీ, తగాదాలు, భార్యా భర్తల గొడవలు, వృద్ధ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్న 
సంతానం, మిస్సింగ్ కేసుల అర్జీలు ఎక్కవగా ఉన్నవి. అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన యస్పి వాటిని సంబంధిత అధికారులకు ఎన్టార్స్ చేయుచూ, దివ్యాంగులను చూసి చలించిన యస్పి వారి వద్దకు వచ్చి సంబందిత అధికారులతో మాట్లాడి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసి, మిస్సింగ్, మహిళల సమస్యలతో వచ్చిన ఫిర్యాదుదారులకు భరోసా కల్పిస్తూ, అదేవిధంగా ఫ్యామిలీ లేదా ఇతర కౌన్సెలింగ్ నిర్వహించేటపుడు అలసత్వం లేకుండా న్యాయ పరమైన చర్యలు తీసుకోవాలని, సివిల్ వ్యవహారాలలో, ఆస్థి, రెవిన్యూ తగాదాలలో ఎప్పటికప్పుడు న్యాయ సలహాలు పొంది డిఎల్‌ఎస్‌ఏ ద్వారా పరిష్కరించాలని ఆదేశించారు. స్పందన కార్యక్రమానికి యస్పి తో పాటు అడిషనల్ యస్పి(క్రైమ్స్) పి.మనోహర్ రావు, నెల్లూరు టౌన్ డియస్పి జె.శ్రీనివాస రెడ్డి, రూరల్ డియస్పి కె.వి.రాఘవ రెడ్డి, యస్.బి. డియస్పి యన్.టా రెడ్డి హాజరుగా ఉన్నారు.



Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget