నెల్లూరు టౌస్, గూడూరు, కావలి, ఆత్మకూరు, యస్.బి. విభాగాల అధికారులకు శిక్షణ
ఎస్సై నుండి డిఎస్పి స్థాయి వరకు 60 మంది అధికారులు హాజరు
నెల్లూరు, పిబ్రవరి 15, (రవికిరణాలు) : శనివారం జిల్లా పోలీసు కార్యాలయం నందు జిల్లా యస్పి భాస్కర్ భూషణ్ ఆదేశాల మేరకు ఐ.టి. కోర్ టీం వారి ఆద్వర్యంలో ఎన్‌ఐసి డిపార్ట్మెంట్ సిబ్బందిచే ఇ-ఆఫీస్ పై పోలీసు అధికారులకు రెండవ రోజు శిక్షణ ఇవ్వడమైనది. ఈ రోజు నెల్లూరు టౌన్, గూడూరు, కావలి, ఆత్మకూరు, ట్రాఫిక్, యస్.బి. విభాగాల అధికారులకు నిర్వహించడం జరిగింది.ఇ-ఆఫీస్ వినియోగించడం ద్వారా కాగితం, సమయం, డబ్బు ఆదా చేయడంతో పాటు మెరుగైన ఉత్పాదకత, డేటా భద్రత, సమగ్రతకు హామీ, పారదర్శకత, జవాబుదారీతనం ఉంటుందని ఎన్‌ఐసి శిక్షణా సిబ్బంది తెలిపారు. ఇ-ఫైల్ అప్లికేషన్ వాడకంలో నైపుణ్యం, లక్షణాల గురించి అవగాహన, మరింత సమర్థవంతంగా పనిచేయడానికి చిట్కాలు మరియు సమస్యలు వస్తే పరిష్కరించుకోవడం కోసం మార్గాలు, పోలీస్ డిపార్టుమెంటులో లీవ్స్, మెమోలు, జనరల్ అర్జీలు, ఎమ్‌సిఆర్ వంటివి పై అధికారులకు పంపే విధానం, అధికారుల అందరిచే ప్రాక్టీస్ చేయించి, సందేహాలను నివృత్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నెల్లూరు ఎన్‌ఐసి శిక్షణా సిబ్బంది, నెల్లూరు టౌన్, గూడూరు, కావలి, ఆత్మకూరు, ట్రాఫిక్, ప్రొబేషనరీ డియస్పి, యస్.బి., అన్ని విభాగాల సిఐ లు, ఎస్‌ఐ లు, ఐ.టి. కోర్ టీం ఇంచార్జ్ ఏఎస్‌ఐ వారి సిబ్బంది పాల్గొన్నారు.
Post a Comment