భారతీయులపాలిట ఉరితాడులా సిఏఏ,ఎన్‌ఆర్‌సి,ఎన్‌ఆర్‌పి చట్టాలు

నెల్లూరు : బుధవారం నగరంలోని రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయులపాలిట ఉరితాడులా సిఏఏ, ఎన్‌ఆర్‌సి, ఎన్‌ఆర్‌పి ల చట్టాలకు వ్యతిరేకంగా, రాకీయాలకు అతీతంగా పోరాటం చేయాలని అన్నారు. సిఏఏ, ఎన్‌ఆర్‌సి, ఎన్‌పిఆర్ అభ్యంతరకర వాటిపై ఇప్పటికే వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి అమలు చేయవద్దని స్పష్టంగా జి.ఓ. జారీ చేసిన ఘనత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కే దక్కుతుందన్నారు. మూడు రాజధానులను శాసనమండలిలో అడ్డుకున్నామని అనే చెప్పే తెలుగుదేశం నాయకులు శాసనమండలిలో సిఏఏ, ఎన్‌ఆర్‌సి, ఎన్‌ఆర్‌పి ల వ్యతిరేకంగా ఎందుకు తీర్మానం చేయలేదో చెప్పాలని ప్రశ్నించారు. ఈ నెల 9వ తేదీ జరిగే రాజ్యాంగ పరిరక్షణ సభకు ముఖ్య ఉపన్యాసకులుగా ప్రొఫెసర్ కె.నాగేశ్వర్, ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం పాల్గొంటారని రూరల్ ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget