మీ విలువై సమయం వృధా కానివ్వం..... వైద్య సేవల కోసం వేచి వుండాల్సిన పనిలేదు సమర్ధత...... నైపుణ్యం కలిగిన వైద్య బృందం సారధ్యంలో....సరికొత్త సేవలు" మొదటిసారిగా నెల్లూరులో గత రెండు దశాబ్దాలుగా మెరుగైన వైద్య సేవలు అందించుటలో ప్రత్యేకత చాటుకున్న నారాయణ హాస్పిటల్, నెల్లూరు జిల్లాతో పాటు పరిసర ప్రాంత జిల్లావాసులకు ఆధునిక వైద్య సేవలు అందించుటలోఅందవేసిన చెయ్యిగా పేరుగాంచి, మెట్రోపాలిటన్ నగరాలకు ధీటైన వైద్య సేవలందిస్తూ ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో ప్రతిష్టాత్మకమైన ఎన్‌ఏఏసి 'ఏ' గ్రేడ్ గుర్తింపు పొంది, అలాగే వైద్య పరీక్షల నైపుణ్యంలో ఎన్‌ఏబిఎల్ గుర్తింపు కలిగి, నారాయణ బ్లడ్ బ్యాంక్ కు ఎన్‌ఏబిబి గుర్తింపును కలిగి ఉంది. అంతే కాకుండా 102కు పైగా కిడ్నీ ట్రప్లాంటేషన్ను విజయవంతంగా పూర్తిచేసిన ఘనత నారాయణ హాస్పిటల్ కే దక్కుతుంది. అలాగే వైద్య పరికరాలలో కూడా భారతదేశంలోనే అత్యంత అధునాతన ఎఫ్‌డి20 క్లారిటీ క్యాథలాబ్, ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి 64 ఛానల్ వీడియో ఈఈజి, దక్షిణ భారతదేశంలో పూర్తిస్థాయి పిడియాట్రిక్ యూరాలజి విభాగం, భారతదేశంలో ఒకే క్యాలెండర్ సంవత్సరంలో 21 మూర్ఛవ్యాధి శస్త్రచికిత్సలు చేసిన ఘనత నారాయణ హాస్పిటల్ కే దక్కుతుంది. ఇంకా ఎన్నో ఆధునికతలకు శ్రీకారం చుట్టిన నారాయణ హాస్పిటల్ జిల్లాలో మొదటిసారిగా సరికొత్త వైద్య సేవలతో ముందుకొచ్చింది.వైద్య సేవల కోసం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా, నాణ్యత ప్రమాణాలు కలిగిన వైద్య సేవలను వేగవంతంగా అందించే విధంగా చక్కటి ప్రణాళికలతో ముందుకొచ్చింది. ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో సమయానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. అలాగే సమయానికి వైద్యచికిత్సలందించడమూ ఎంతో కీలకం. ఈ రెండింటి అవసరాన్ని గుర్తించి సకాలంలో వైద్య సేవలు అందించేందుకు మరో ముందడుగు వేసింది నారాయణ హాస్పిటల్నేడు ఆరోగ్యం , ఆహార్యంపై 70 శాతం మందికి ఒక స్పష్టమైన ఆలోచన ఉంది. అయితే వృత్తి, వ్యాపకాల దృష్ట్యా ముందస్తు జాగ్రత్తలైన ప్రాధమిక పరీక్షలకు సమన్వయం కుదరడం లేదనేది వాస్తవం. ఇప్పుడు అంత మధనపడాల్సిన అవసరం లేకుండా నారాయణ హాస్పిటల్ సామాజిక స్పృహతో ఆరోగ్య సమాజం కోసం ఈ సమస్యల నుండి బయటపడేందుకు సరికొత్త సేవా పద్ధతి అందుబాటులోకి తెచ్చింది. సమర్థత కలిగిన వైద్య బృందం, అవసరమైన వైద్య పరీక్షలు, ఫార్మశి సంప్రదింపులకు పేషెంట్ రిలేటివ్ ఎగ్జిక్యూటిస్తే పర్యవేక్షణలో వేగవంతమైన వైద్యసేవలు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.అత్యంత సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఈ వైద్య సేవలన్నీ ఒకే చోట స్పెషాలిటీ బ్లాక్-2 గ్రౌండ్ ఫ్లోర్ నందు నిర్ణీత సమయంలోనే పూర్తయ్యే విధంగా, ఆధునీకరించబడిన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మీ విలువైన సమయాన్ని వృధా కాకుండా చూస్తారు. కార్డియాలజి మొదలు సైకియాట్రి వరకు అన్ని స్పెషాలిటీలు అందుబాటులో ఉంటాయి. ఒక్కో స్పెషాలిటీ నుంచి ఒక్కో వైద్య నిపుణుడు అన్ని పని దినాలలో అందుబాటులో ఉంటారు. ఇందుకోసం 9640100566 అనే నెంబర్ ద్వారా సంప్రదించి వైద్యుల వివరాలు, వైద్య సేవల సదుపాయముల గురించి తెలుసుకోవచ్చు.హీలింగ్ హ్యాండ్స్ - కేరింగ్ హార్ట్ అనే నినాదంతో అత్యున్నత ప్రమాణాలతోపాటు వేగవంతమైన వైద్య సేవలు ప్రజలందరూ సద్వినియోగపరచుకుని, సమర్ధవంతమైన, సౌకర్యవంతమైన వైద్య సేవలు పొందగలరని ఆశిస్తున్నాము.నారాయణ హాస్పిటల్ సిఈఓ డా|| ఎస్. సతీష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పత్రికా సమావేశంలో అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ డా॥ బిజు రవీంద్రన్, ఏజిఎమ్ సి.హెచ్. భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Post a Comment