ఇందుకూరుపేట మండలంలోని రావూరు గ్రామంలో ఎటువంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన డియస్ టెక్నో ఫీడ్స్ కంపెనీ లో జంతు మాంసలు తో వ్యాపారాలు కొనసాగించడం వలన కుళ్ళిన మాంసం వ్యర్థాలతో ఏర్పడే దుర్వాసన తో గ్రామస్తుల తీవ్ర అనారోగ్యాన్ని గురి అవుతున్నారు, వాసనలు తట్టుకోలేక గ్రామ ప్రజలు ప్రతి రోజు నరకయాతన అనుభవిస్తున్నారు, దింతో గ్రామస్థులు డియస్ టెక్నో ఫీడ్స్ ఫ్యాక్టరీని మూసివేయాలని ప్రజా నేత, కోవూరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి దృష్టి కి తీసుకోని వెళ్లడంతో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సోమవారం రావూరు గ్రామంలో అధికారులతో కలిసి సుడి గాలి పర్యట చేశారు, గ్రామంలోని డియస్ టెక్నో ఫీడ్స్ ఫ్యాక్టరీ నీ పరిశీలించారు, అక్కడ పరిస్థితులను చూసి ఎమ్మెల్యే నివ్వెర పోయారు, వెంటనే ఫ్యాక్టరీని సీజ్ చేయించారు ఎమ్మెల్యే,దింతో గ్రామ ప్రజలు ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలియజేశారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో ఎటువంటి అనుమతులు లేకుండా మాంసపు శుద్ధి ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసి ,మాసం నిల్వ చేయడంతో దుర్వాస వేదజల్లడం తో ప్రజలు అనారోగ్యనికి గురువతున్నారు,వెంటనే అధికారులు ఫ్యాక్టరీ యాజమాన్యం పై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేయడం జరిగింది అన్నారు, ఈయన వెంట పోల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇఇ ప్రమొదర్ రెడ్డి,వైసీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు ఉన్నారు
Post a Comment