ఎస్పి పర్యవేక్షణలో డిపిఒ నందు 'స్పందన' నిర్వహణ


సంబంధిత అధికారులతో చరవాణిలో మాట్లాడి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు 
కుటుంబ తగాదాల కేసులలో పలు మార్లు కౌన్సెలింగ్ ఇప్పించాలి 
జిల్లా వ్యాప్తంగా స్పందనకు ఈ రోజు మొత్తం “132" ఫిర్యాదులు 

జిల్లా యస్పి భాస్కర్ భూషణ్ జిల్లా వ్యాప్తంగా అన్నీ పోలీసు స్టేషన్ లు, సర్కిల్, యస్.డి.పి.ఒ. ఆఫీసులలో జరుగుతున్న "స్పందన” కార్యక్రమంను లైవ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షిస్తూ, అక్కడి అధికారులతో ఫోన్ లో మాట్లాడుతూ తగిన సూచనలు, సలహాలు అందిస్తూ, పిర్యాదులను 7 రోజులలోగా పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేసినారు. స్పందనకు జిల్లా నలుమూలల నుండి డిపిఒ స్పందన కార్యక్రమానికి మొత్తం 115 మంది ఫిర్యాదుదారులు హాజరుకాగా, అన్నీ సబ్ డివిజన్ స్థాయిలో మరో 17 ఫిర్యాదులు అందినవి. ఈ రోజు వచ్చిన ఫిర్యాదులలో సైబర్ నేరాలు, కుటుంబ తగాదాలు, భూ తగాదాలు, వృద్ధ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్న సంతానం, మహిళలను వేధించిన కేసుల అర్జీలు ఎక్కవగా ఉన్నవి. అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి, సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడుతూ, చట్టపరం చర్యలు తీసుకోవాలని, అవసరం అయితే వెంటనే కేసులు నమోదు చేయాలని, కుటుంబ కలహాల కేసులలో ప్రతి ఒక్కరికీ తగాదాలు పునరావృతం కాకుండా పలు మార్లు కౌన్సెలింగ్ ఇప్పించాలని, కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే అమలు చేసి భాదితులకు న్యాయం చేయాలని, అంతేకాకుండా ప్రత్యేకంగా మహిళలు, బాలలు, వృద్ధుల రక్షణకు పూర్తి భరోసా, భద్రత కల్పించాలని సూచించారు. స్పందన కార్యక్రమానికి అడిషనల్ యస్.పి. (క్రైమ్స్) పి.మనోహర్ రావు, నెల్లూరు టౌన్ డియస్పి జె.శ్రీనివాస రెడ్డి, రూరల్ డియస్పి కె.వి.రాఘవ రెడ్డి, యస్.బి డియస్పి యన్. కోటారెడ్డి, యస్.బి. సి.ఐ. శ్రీనివాసులు రెడ్డి హాజరుగా ఉన్నారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget