కోట, ఫిబ్రవరి 10 : అన్ని దానాలలో కెల్లా నేత్ర గొప్పదని, ""సర్వేంద్రియానం నయనం ప్రధానం "మోడ్రన్ కంటి వైద్యశాల కంటి వైద్య నిపుణులు డాక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు.సోమవారం కోట మండలం చం దుడు గ్రామంలోని స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు గారి నివాసంలో ఎం వి రావు పౌండేషన్ మరియు శంకర్ ట్రస్ట్ సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు.
ఈ శిబిరాన్ని ఎం వి రావు పౌండేషన్ వైస్ చైర్మన్ యమ్ ఆదిలక్ష్మి ప్రారంభించారు .
ఈ సందర్భంగా కంటి వైద్య నిపుణులు డాక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అన్ని దానాలలో కెల్లా నేత్ర దానం గొప్పదని ఇలాంటి నేత్ర వైద్య శిబిరాలు ఎం వి రావు పౌండేషన్ నిర్వాహకులు నిర్వహించడం అభినందనీయమన్నారు. స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావుగారి కుటుంబ సభ్యులు 17 మంది చనిపోయిన తర్వాత నేత్రదానం చేయటమే కాక దాదాపు 150 మంది చే నేత్రదానం చేయించేందుకు అంగీకార పత్రాలు జిల్లా అంధత్వ నివారణ సంస్థకు, మరియు నెల్లూరు మోడ్రన్ కంటి ఆసుపత్రి వారికి అంగీకార పత్రం అందజేయడం అభినందించదగ్గ విషయం అన్నారు.అదే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో కంటి చూపు కాన రాక ఇబ్బందులు పడే వారికి ప్రతి నెలా కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వారికి కంటిచూపు ప్రసాదించడం చాలా ఆనందంగా ఉందని ఆయన అన్నారు .అనంతరం నెల్లూరు కంటి ఆసుపత్రి కంటి వైద్య నిపుణులు డాక్టర్ వెంకటేశ్వర్లు ఈ వైద్య శిబిరానికి హాజరైన 150 మంది రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు .వారిలో కంటి శుక్లాలు ఉన్న వారిని గుర్తించి సోమవారం నెల్లూరు మోడల్ కంటి వైద్యశాలలో ఆపరేషన్లు చేయించేందుకు నెల్లూరుకు తరలించారు.అదేవిధంగా వారికి భోజన వసతి, కంటి అద్దాలు ,మందులు ,ఉచితంగా ఇవ్వనున్నట్లు సంస్థ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ తెలిపారు.మిగిలిన కంటి సమస్యలతో బాధపడేవారికి నిర్వాహకులు ఉచితంగా మందులు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎం వి రావు పౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలామోహన కృష్ణ, ముప్పవరపు ఆదిలక్ష్మి, ముప్పవరపు విజయలక్ష్మి, ముప్పవరపు లహరి, ముప్పవరపు వెంకట లాస్య, మరియు నెల్లూరు మోడల్ కంటి వైద్యశాలకు చెందిన వైద్య సిబ్బంది, కంటి సమస్యతో బాధపడే రోగులు ఈ వైద్య శిబిరంలో పాల్గొన్నారు.
Post a Comment