చట్టాలపై పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకోండి - వైస్ ప్రిన్సిపాల్
శిక్షణకు హాజరైన 171 మంది శిక్షణార్ధులు
జిల్లా పోలీసు శిక్షణా కేంద్రం, చెముడుగుంట నందు 6వ బ్యాచ్ గ్రామ/వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శుల (మహిళా పోలీసు అధికారులు) 2వారాల శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం డిటిసి ప్రిన్సిపల్ - అడిషనల్ యస్పి(క్రైమ్స్) పి.మనోహర్ రావు డిటిసి వైస్ ప్రిన్సిపల్ ఎస్.వి. గోపాల క్రిష్ణ సమక్షంలో ప్రారంభించారు.ఈ సందర్భంగా అడిషనల్ యస్పి(క్రైమ్స్) మాట్లాడుతూ శిక్షణలో డయల్ 100, 181, దిశ, మహిళా మిత్ర, సైబర్ మిత్ర, సిసిటిఎన్‌ఎస్, ఐపిసి, సిఆర్ పిసి చట్టలతో పాటు, ఐసిడిఎస్ విధులపై పూర్తి అవగాహన ఏర్పరుచుకోవాలని, అంతేకాకుండా శాంతి భద్రతలు, మహిళలు, బాలలు, వృద్ధులపై జరిగే హింస, లైంగిక వేదింపులు,
దాడులు జరగకుండా ప్రతి మహిళ సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టి వారికి రక్షణ భద్రత కల్పించడంలో సేవలు అందిందాల్సి ఉంటుందని, స్టేషన్ లలో ఉన్న ప్రతి ఒక్కరితో మర్యాదగా నడుచుకోవాలని, డిటిసిలో ముందు జరిగిన 5 బ్యాచ్ లలో మంచి ఫలితాలతో స్టేట్ లోనే టాప్ లో నిలిచిందని, ఎంతో ఉన్నత విద్యార్హతలు కలిగిన మీరు ఈ ఉద్యోగాలు పొందటం అభినందనీయమని, ఎలాంటి టెన్షన్ పడకుండా శిక్షణ విజయవంతంగా ముగించాలని ఈ సందర్భంగా శిక్షణార్ధులకు సందేశాన్ని అందిస్తూ, శిక్షణ సమయంలో గానీ, తరువాత ఎప్పుడైనా ఎలాంటి సమస్యలున్నా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని ఈ సందర్భంగా శిక్షణార్ధులకు మనో ధైర్యం, భరోసా కల్పించిన అనంతరం శిక్షణ పాఠ్యప్రణాళిక పుస్తకాలను అందజేశారు. ఈ శిక్షణ కార్యక్రమంలో డిటిసి వైస్ ప్రిన్సిపల్ - డియస్పి కో ఆర్డినేట్ చేస్తూ ఈ రోజు మొత్తం 171 మంది అభ్యర్ధినులు 6 బ్యాచ్ శిక్షణకు రిపోర్ట్ చేసుకోవడం జరిగిందని, మీరందరూ మా చెల్లెళ్లు మరియు బిడ్డలతో సమానమని, శిక్షణలో తెలుసుకున్న విషయాలను ఫీల్డ్ లో అమలుపరదాల్సి ఉంటుందని, మీ పరిధిలోని నేరస్తులకు చట్టం ప్రకారం శిక్ష పడేలా చూడాలని, ముందు బ్యాచ్ శిక్షణార్ధులు ఇచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా కరాటే, యోగాలకు సంబంధించి థీయరీ క్లాసులు యేర్పాటు చేయనున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పై అధికారులతో పాటు డిటిసి-ఆర్‌ఐ డి.సురేష్, ఎస్‌ఐ, ఆర్‌ఎస్‌ఐ శిక్షణా సిబ్బంది పాల్గొన్నారు.
Post a Comment