నెల్లూరు, పిబ్రవరి 10, (రవికిరణాలు) : సోమవారం జిల్లా యస్పి భాస్కర్ భూషణ్ జిల్లా పోలీసు కార్యాలయంలో ఉదయం 10.30 గంటల నుండి మధ్యాహ్నం 02.30 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న"స్పందన" కార్యక్రమంనకు అందిన ఫిర్యాదులను 7 రోజులలోగా పరిష్కరించాలని, అన్నీ పోలీసు స్టేషన్ లు, సర్కిల్, యస్.డి.పి.ఐ. ఆఫీసులలో జరుగుతున్న స్పందన కార్యక్రమంను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షిస్తూ, వెంటనే వారి సమస్యల పై అక్కడి అధికారులతో లైవ్ లో మాట్లాడుతూ తగిన ఆదేశాలు జారీ చేసినారు. స్పందనకు జిల్లా నలుమూలల నుండి యస్పి స్పందన కార్యక్రమానికి మొత్తం 110 మంది ఫిర్యాదుదారులు హాజరుకాగా, అన్నీ సబ్ డివిజన్ స్థాయిలో మరో 18 ఫిర్యాదులు అందినవి. ఈ రోజు వచ్చిన ఫిర్యాదులలో భూతగాదాలు, భార్యా భర్తల గొడవలు, వృద్ధ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్న సంతానం, మిస్సింగ్ కేసుల అర్జీలు ఎక్కవగా ఉన్నవి. అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన యస్పి వాటిని సంబంధిత అధికారులకు ఎగ్జార్స్ చేయుచూ, అనుమానాస్పద మృతుల కేసుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అదేవిధంగా మిస్సింగ్ కేసుల ట్రేసింగ్ విషయంలో అలసత్వం వహిస్తే కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని ఆదేశించారు. ఫిర్యాదుదారులను స్టేషన్ ల చుట్టూ తిప్పుకోకుండా ప్రత్యేక శ్రద్ధ వహించి, వారికి న్యాయం జరిగేలా త్వరితగతిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, మహిళలు, బాలలు, వృద్ధులపై జరిగే హింస, లైంగిక వేదింపుల కేసులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, అదేవిధంగా సివిల్ నేచర్ ఫిర్యాదులతో స్పందనకు వస్తున్న పిర్యాదు దారులకు జిల్లా న్యాయ సేవ అధికారిక సంస్థ (డిఎల్‌ఎస్‌ఏ) రెవిన్యూ సేవలు కూడా వినియోగించుకోవాలి అని సూచించారు. స్పందన కార్యక్రమానికి యస్పితో పాటు అడిషనల్ యస్పి(క్రైమ్స్) పి.మనోహర్ రావు, నెల్లూరు టౌన్ డిఎస్పి జె.శ్రీనివాస రెడ్డి, రూరల్ డిఎస్పి కె.వి.రాఘవ రెడ్డి, యస్.బి డిఎస్పి యన్.కోటారెడ్డి హాజరుగా ఉన్నారు.
Post a Comment