ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కాకాణి


నెల్లూరు, పిబ్రవరి 11, (రవికిరణాలు) : నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి.ఎమ్మెల్యే కాకాణికి ఘన స్వాగతం పలికిన రైతులు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అందరం కోరుకొని, అందరం కలసి మహానేత రాజశేఖర్ రెడ్డి పాలనను తిరిగి తెచ్చుకోవడం జరిగింది. రైతులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని విధాలుగా చేయూత ఇస్తున్నారు.గతంలో పనిచేసిన చంద్రబాబు రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా మోసం చేశాడు.రైతులు  పండించిన 
అపరాల సాగులో రైతులు నష్టపోతున్నారని నా దృష్టికి వచ్చింది.ఎక్కడా రైతులకు  ఇబ్బందులు లేకుండా ఇన్ పుట్ సబ్సిడీ ద్వారా రైతులకు న్యాయం చేస్తాం. గతంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను అవసరమైనన్ని ఏర్పాటు చేయకుండా, మద్దతు ధర కల్పించకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.గత ప్రభుత్వంలో రైతులకు అన్యాయం జరిగిందని పలువురు అధికారులు కూడా చెప్పడం ఆశ్చర్యకరం!.కానీ ప్రస్తుతం రైతులు 
ఎక్కడా ఇబ్బందులు పడకుండా ఉండేలా ముఖ్యమంత్రి అన్ని చర్యలు తీసుకుంటున్నారు. రైతుభరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన వాటిని ఇంటి వద్దకే చేరుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి 3 వేల కోట్లతో ధర స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి రైతులు నష్ట పోకుండా మద్దతు ధరను కల్పిస్తున్నారు.రైతులకు ఇబ్బందులు లేకుండా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. సాగునీటి విషయంలో ఎక్కడా ఇబ్బందులు లేకుండా కండలేరు ఎడమ కాలువ ద్వారా 23 వేల ఎకరాలకు సమృద్ధిగా సాగు నీరు అందించడం జరుగుతుంది.గత ప్రభత్వంలో మాదిరిగా సాగునీటి రాజకీయాలకు తావు లేకుండా సాఫీగా సాగునీటిని అందించాము.ప్రతి నియోజకవర్గంలో వ్యవసాయ మార్కెట్ కమిటీలను ఏర్పాటు చేసి, వాటికి స్థానిక శాసన సభ్యులను గౌరవ అధ్యక్షులుగా నియమిస్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డి ది. కొందరు ఈ ప్రభుత్వం పై దుర్మార్గపు అసత్య ఆరోపణలు చేస్తున్నారు.రేషన్, పింఛన్ల విషయంలో అర్హులైన ప్రతి ఒక్కరికి అందించే బాధ్యత నాది.
గతంలో అభివృద్ధి చేసారంటూ శంకుస్థాపన రాళ్లు వేశారు తప్ప, అభివృద్ధి జరగని 
పరిస్థితి.కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతి ప్రాంతంలో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తుంది.పెద్దలు ఆనం రామనారాయణరెడ్డి, మా తండ్రి రమణారెడ్డి చొరవతో కండలేరు ఎడమకాలువ రావడం జరిగింది. గతంలో ఇక్కడ వ్యవసాయ మంత్రిగా పనిచేసిన వ్యక్తి నిర్లక్ష్యం వలన సాగు నీటి విషయంలో రైతులు ఇబ్బందులు పడ్డారు.రైతులను మోసం చేస్తే వాళ్ల ఉసురు తగులుతుంది.నేను గత 5 సంవత్సరాలలో చేయలేని అభివృద్ధిని ఈ 5 సంవత్సరాలు10 సంవత్సరాల అభివృద్ధి చేస్తాను.రైతులు హర్షించే విధంగా అభివృద్ధి పనులు చేసి, రైతులకు ఎల్లవేళలా అండగా ఉంటాను.




Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget