హనుమారెడ్డికి శ్రద్ధాంజలి ఘటించిన జిల్లా రచయితల సంఘం

నెల్లూరు, జనవరి 22, (రవికిరణాలు) : ప్రముఖ సాహితీవేత్త రచయిత కవి న్యాయవాది ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం గౌరవ అధ్యక్షుడు బి.హనుమారెడ్డి మృతికి నెల్లూరు జిల్లా రచయితల సంఘం బుధవారం నెల్లూరు టౌన్ హాల్ రీడింగ్ రూమ్లో ఘనంగా శ్రద్ధాంజలి ఘటించి, వారి మృతికి వక్తలు తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా హనుమారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు .కార్యక్రమానికి అధ్యక్షత వహించిన నీరసం అధ్యక్షుడు జయప్రకాశ్ మాట్లాడుతూ ముప్పై సంవత్సరాలు ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడిగా వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేశాడని ఈ నెల 17,18,19 తేదీలలో ఒంగోల్లో తెలుగు ప్రాభవం అనే సాహితీ కార్యక్రమాన్ని తొమ్మిదవ రాష్ట్రస్థాయి రచయితల మహాసభలు ఏర్పాటు చేసి మొదటి రెండు రోజులు వివిధ కార్యక్రమా లు ఏర్పాటు చేసి రచయితలను కవులను ఘనంగా సన్మానించి అనారోగ్య కారణంగా తన బాధ్యతలను వేరే వారికి అప్పగించి చివరి రోజు సమావేశాన్ని చూడకుండానే ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లిన హనుమారెడ్డి సాహితీ లోకం ఎప్పటికీ
మర్చిపోలేదన్నారు. ఆయన మృతి తెలుగు సాహితీ ప్రపంచానికి తీవ్ర లోటని ఆయనే ఆవేదన వ్యక్తం చేస్తారు. చివరి క్షణం వరకు భాషా సేవకు అంకితమై ఆర్ ఆ కార్యక్రమాల నిర్వహణలోనే తుదిశ్వాస వదిలిన హనుమారెడ్డి ఆత్మకు శాంతి కలగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నెరసం ప్రధాన కార్యదర్శి డాక్టర్ పాతూరి అన్నపూర్ణ, ఉపాధ్యక్షుడు మాటేటి రత్నప్రసాద్, కార్యవర్గ సభ్యులు నారాయణరెడ్డి, నజ్మా, దయకరరెడ్డి, ఆచార్య ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget