శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి కుంభాభిషేక మహోత్సవ ఆహ్వానం
నెల్లూరు, జనవరి09, (రవికిరణాలు) : నెల్లూరు నగరంలోని స్థానిక స్టౌన్‌హౌస్‌పేటలో వెలసియున్న శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థాన కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 1వ తేది నుంచి 5వ తేది వరకు ఘనంగా నిర్వహిస్తున్నామని దేవస్థాన ధర్మకర్తల మండలి గౌరవ అధ్యక్షులు ముక్కాల ద్వారకానాథ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి 1898వ సంవత్సరంలో ఆలయ నిర్మాణం జరిగి మరల 122 సంవత్సరాల తరువాత 2020లో పున:నిర్మాణం గావిస్తోందని అన్నారు. దేవస్థాన కుంభాభిషేకమహోత్సవంలో కంచి కామకోటి మూలామ్నాయ సర్వజ్ఞ పీఠము, కాంచీపురం శ్రీ జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి శంకరాచార్యుల వారి దివ్యహస్తములచే దేవతామూర్తుల ప్రతిష్ఠ, విమాన గోపురముల కలశములకు మహాకుంభాభిషేకం నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షులు దాసా సురేష్, కార్యదర్శి అయితా రామచంద్రరావు, కోశాధికారి పబ్బిశెట్టి శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు సుంకు మనోహర్, సహాయ కార్యదర్శి దొంతంశెట్టి వివేకానందం, కమిటీ సభ్యులు శ్రీరాం సురేష్, శరణ్‌కుమార్, సూర్యనారాయణ, సుబ్రహ్మణ్యం, సీతారామారావు, శ్రీనివాసులు, మంజులూరు శ్రీనివాసులు, బిచ్చుబాబు, మల్లికార్జున, వెంకట సత్యనారాయణ, భాస్కర్, కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Post a Comment