ఎర్రచందనం స్మగ్లర్ల పై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు వారి ఆస్తులను జప్తు చేస్తూ చర్యలు తీసుకుంటామని నెల్లూరు జిల్లా యస్పి భాస్కర్ భూషణ్ ఇదివరకే స్పష్టమైన ఆదేశాలు జారీచేయడం జరిగింది. ఈ మేరకు గూడూరు డిఎస్పి, వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్, టాస్క్ ఫోర్సు ఇన్స్పెక్టర్ ఐ.శ్రీనివాస్, రాపూరు ఎస్సై లు సిహెచ్. కోటిరెడ్డి, కె.స్వప్న, వారి సిబ్బంది ఎర్రచందనం దుంగలను రవాణా చేస్తున్న స్మగ్లర్ ను పట్టుకొని అతని వద్ద నుంచి 10లక్షల విలువ చేసే ఎర్రచందన స్వాధీనం చేసుకున్నారు. పై ముద్దాయిని తేది 18.01.2020 న సాయంత్రం 18.30 గంటలకు రాపూ స్టేషన్ పరిధిలోని పులి బోర్డ్, రాపూరు-రాజంపేట రోడ్డు వద్ద రాపూరు ఎస్.ఐలు ఏ-1 అరెస్ట్ చేయగా, మిగిలిన ముద్దాయి ఏ-2 కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ముద్దాయి గతంలో రాపూర్ పోలీసు స్టేషన్ లో పిడి యాక్ట్ కింద కేసులు నమోదు చేయబడి షీట్ కూడా ఓపెన్ చేయడం జరిగిందని పోలీసులు తెలిపారు. పై కేసును చేధించి, ముద్దాయిలను అరెస్ట్ చేయుటలో ప్రతిభ కనబరిచిన రాజ సిహెచ్ కోటిరెడ్డి, కె స్వప్న, వారి సిబ్బందిలను వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ అన్వర్ బాష, టాస్క్ ఫోర్సు ఇన్స్పెక్టర్ ఐ.శ్రీనివాస్‌లు అభినందించారు.
Post a Comment