నెల్లూరు, జనవరి 30, (రవికిరణాలు) : రాష్ట్రంలోని 13 జిల్లాల అభివృద్ధిని కాంక్షిస్తూ శాసనసభలో అధికార వికేంద్రీకరణ బిల్లును ప్రవేశపెట్టడంతో శాసనమండలిలో టిడిపి ఎమ్మెల్సీలు అడ్డుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డా||పి. అనీల్ కుమార్ నాయకత్వంలో వైఎస్ఆర్ సిపి యువజన విభాగం వికేంద్రీకరణ బిల్లుకు మద్దతుగా నెల్లూరు నగరంలోని పెద్దపోస్టాఫీసు నందు రాష్ట్రపతికి ఉత్తరాలు వేయడం జరిగింది.ఈ సందర్భంగా యువజన విభాగ నగర అధ్యక్షులు గంధం సుధీర్ బాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని 13 జిల్లాల అభివృద్ధిని కోరి శాసనసభలో అధికార వికేంద్రీకరణ బిల్లు ప్రవేశపెట్టారన్నారు. అసెంబ్లీలో ఆమోదం పొందిన వికేంద్రీకరణ బిల్లును శాసనమండలిలో విపక్షనేత చంద్రబాబునాయుడు అనైతికంగా అడ్డుకున్నారన్నారు. ప్రజాస్వామ్య విలువలను మంటగలిపే రీతిలో మండలి ఛైర్మన్ ఇలా చేయడం తప్పని చెబుతూనే మరోవైపు విచక్షణాధికారం పేరిట ఆ బిల్లును ఆలస్యం చేసేందుకు సెలెక్ట్ కమిటీకి పంపిస్తాననడం మంచి పద్ధతి కాదన్నారు. రాష్ట్ర సర్వతోముకాభివృద్ధికి భంగం కలిగించే ఈ ప్రజావ్యతిరేక విధానాలను ఖండిస్తునామన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల బాధను దయతో అర్థం చేసుకొని ప్రజా ప్రయోజకనాలను పరిరక్షించాలని, ప్రజాస్వామ్య విలువలు కాపాడాలని కోరుకుంటున్నామని రాష్ట్రపతికి రాసిన ఉత్తరాలలో పేర్కొనడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గంధం సుధీర్ బాబు, వేలూరు మహేష్, తేలిమేటి రాజు, కె.మల్లి, అశోక్, సుభాని, కుమార్, రాజా, శంకర్, లలితకుమార్, అమృతం మల్లికార్జున్, తదితరులు పాల్గొన్నారు.
Post a Comment