లబ్దిదారులు 'అమ్మఒడి' పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి - జిల్లా కలెక్టర్‌

నెల్లూరు, జనవరి09, (రవికిరణాలు) : అమ్మఒడి పథకం ద్వారా పిల్లల తల్లుల అకౌంట్లలో జమ అయిన 15 వేల రూపాయలను పిల్లల భవిష్యత్తుకు, ఇతర విద్యా అవసరాలకు మాత్రమే వినియోగించుకొని సదరు పథకాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా జిల్లా కలెక్టరు ఎం.వి.శేషగిరిబాబు లబ్దిదారులను కోరారు.గురువారం ఉదయం స్థానిక కె.ఎన్.ఆర్. నగరపాలక ఉన్నత పాఠశాల నందు నిర్వహించిన అమ్మఒడి పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తు ఎక్కువ శాతం తల్లి పాత్ర పై ఆధార పడి వుంటుందని తల్లులు తమ పిల్లలను సమాజంలో సమాజపరిస్థితులను అనుసరించి మంచి నడవడికతో సామాజిక పరిస్థితులను అర్థం చేసుకొనే విధంగా పెంచాలన్నారు. పెద్దల ఎడల మర్యాద బాధ్యత ఎరిగి నడుచుకొనేలా, తీర్చిదిద్దవలసిన బాధ్యత వుందన్నారు. మొబైల్స్, కంప్యూటర్ల వినియోగాన్ని తగ్గించే విధంగా పిల్లలకు తగిన దిశానిర్దేశం చేయవలసిన అవసరం వుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తల పెట్టిన అమ్మ ఒడి కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని పిల్లల ఉన్నత చదువుల కై అందరూ కృషి చేయవలసిన అవసరం వుందన్నారు. పిల్లల చదువుకై భవిష్యత్తులో ఎటువంటి యిబ్బందులు కలగకూడదనేదే అమ్మఓడి కార్యక్రమం ముఖ్య
వుద్దేశ్యమని ఆయనన్నారు. శాసనమండలి సభ్యులు విఠపు బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ రాష్ట్రం మొత్తంమీద సుమారు 42 లక్షలకు పైగా విద్యార్థినీ, విద్యార్థులు అమ్మ ఒడి పథకం ద్వారా లబ్ది పొందడం గొప్ప విషయమన్నారు. ఈ పథకాన్ని మొట్టి మొదటి సారిగా ప్రారంభించడం జరిగిందన్నారు. తాము చదువుకునేటప్పుడు ఇటువంటి అవకాశాలు లేవని, స్కాలర్ షిట్లు మాత్రమే వుండేవని ఆయన గురు చేశారు. పేద పిల్లలు బడి మానివేయకుండా వారి చదువుకై అవసరమైన ఖర్చులను అందజేయడం ద్వారా వారిలో విద్యశాతాన్నిపెంచడమే ముఖ్య వుద్దేశ్యమన్నారు. నిరు పేద లైన తల్లిదండ్రులకు ఇదొక వరమని, ప్రభుత్వ
పాఠశాలల్లో ఉచిత బోధన వున్నప్పటికి చదువుకై వారి వారి అవసరాల నిమిత్తం అమ్మఒడి పథకం ఎంతో ఉపయోగపడుతుందని ఆయన కొనియాడారు. రానున్న విద్యాసంవత్సరం నుండి కె.ఎన్.ఆర్. ఉన్నత పాఠశాలలో ఇంటర్మీడియట్ ను ప్రవేశ పెట్టే అవకాశం వుందన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి జనార్థనాచార్యులు, సమగ్రశిక్ష ప్రాజెక్ట్ అధికారి బ్రహ్మానంద రెడ్డి, కె.ఎన్.ఆర్. ఉన్నత పాఠశాల ప్రధానోపాద్యాయులు విజయ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.తొలుత జ్యోతి ప్రజ్వలన అనంతరం పాఠశాల విద్యార్థినులు కుమారి తేజస్విని, కుమారి శరణ్య, కుమారి గాయత్రిలు జాతీయ గీతాలాపన చేశారు. కార్యక్రమం అనంతరం
లబ్ధిదారులు సుబ్బమ్మ, అర్చన, అరుణ, ఉమ, శైలజ, గాయత్రి స్వప్న ప్రియ తదితరులకు అమ్మఒడి చెక్కులను జిల్లా కలెక్టరు శాసనమండలి సభ్యులు తదితరులు అందజేశారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget