ఇంటి దొంగను పట్టుకున్న కోవూరు పోలీసులు

సుమారు రూ.2,70,000 విలువగల బంగారు ఆభరణాలు, నగదు స్వాధీనము

సాంకేతిక విభాగము సహాయంతో ఇంటి దొంగతనము కేసులలో ముద్దాయి అరెస్ట్‌

కోవూరు, జనవరి 17, (రవికిరణాలు) : గత సంవత్సరం జులై 23న రాత్రి కోవూరు మండలం కోవూరు టౌన్ నందు కొంతమంది దొంగలు నాలుగు ఇళ్లలోకి చొరబడి బంగారు, డబ్బు, ఒక టివి సుమారు మొత్తంవిలువ సుమారు రూ.2,70,000 చోరి అయినట్లు రిపోర్ట్ లు ఇవ్వగా సదరు విషయమై కోవూరు పోలీసు స్టేషన్ ఎస్‌హెచ్ఒ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సదరు కేసులలో నెల్లూరు పోలీసు సాంకేతిక విభాగము సహకరముతో, నెల్లూరు రురల్ డిఎస్పి కెవి రాఘవరెడ్డి పర్యవేక్షణలో కోవూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ డిఎల్ శ్రీనివాస రావు, కోవూరు యస్ఐ సిహెచ్.కృష్ణ రెడ్డి, తన సిబ్బంది, కోవూరు ఐ.డి పార్టీ సిబ్బంది సహాయముతో నేరస్తులపై నిఘా ఉంచి శుక్రవారం మద్యాహ్నం సాలుచింతల సెంటర్లో ఉన్న దుకాణాల వద్ద కట్టా.రాము అనే అతనిని అనుమానించి విచారణ చేయడంతో అతని వద్ద వున్న బంగారు అభరణలు, నగదును అదుపులో తీసుకొనుటకు యత్నించగా నేరస్థుడు పారిపోవుటకు ప్రయత్నం చేయడంతో యస్ఐ తన సిబ్బంది సహాయముతో అతనిని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి నాలుగు కేసులలోని సుమారు రూ.2,70,000 విలువ గల బంగారు, నగదులను స్వాదినం చేసుకున్నారు.



Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget