భారత ఉప రాష్ట్రపతి యం.వెంకయ్యనాయుడు, రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్‌లు ఈ నెల 21వ తేదీన విక్రమ సింహపురి విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో జరిగే స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొనుచున్న నేపధ్యంలో స్నాతకోత్సవ ఏర్పాట్లను పటిష్టంగా ఏర్పాటు చేసినట్లు విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య ఆర్.సుదర్శన రావు తెలిపారు. ఆదివారం ఉదయం స్థానిక కస్తూరిబా కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో విక్రమ సింహపురి విశ్వ విద్యాలయం ఉప కులపతి ఆచార్య ఆర్.సుదర్శన రావు మాట్లాడుతూ 2008 సంవత్సరంలో 6 కోర్సులతో ఏర్పాటు చేయబడిన విక్రమ సింహపురి విశ్వ
విద్యాలయం, నేడు 17 రెగ్యులర్ కోర్సుతో విద్యనందించడం జరుగుచున్నదన్నారు. తొలిసారిగా 2014 సంవత్సరంలో స్నాతకోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని, తదుపరి వివిధ కారణాల వలన స్నాతకోత్సవ కార్యక్రమాన్ని జరపబడ లేదని ఆయన తెలిపారు. 2014-15, 2015-16, 2016-17, 2017-18 సంవత్సరాలకు సంబంధించి 4 సంవత్సరాలకు ఒకే సారి ఈ నెల 21వ తేదీ స్నాతకోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించి, విద్యార్థులకు పట్టాల ప్రదానం చేయడం జరుగుతుందన్నారు. ఈ నాలుగు సంవత్సరాలకు సంబంధించి మొత్తం 18,698 మంది విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకోవడం జరిగిందని, ఇందులో 17,969 మంది విద్యార్థులకు సంబంధించిన పట్టాలు వారు విద్యనభ్యసించిన విశ్వ విద్యాలయం అనుబంధ కళాశాలకు పంపించడం జరుగుతుందని తెలిపారు. విశ్వ విద్యాలయం నియమ నిబంధనల మేరకు విశ్వ విద్యాలయం ప్రధాన కేంద్రంలోను, కావలిలోని పి.జి. కేంద్రంలో చదివిన 730 మంది విద్యార్థులకు మాత్రమే ఈ నెల 21వ తేదీన కస్తూరిభా కళాక్షేత్రంలో జరిగే స్నాతకోత్సవ కార్యక్రమంలో పట్టాలు ప్రదానం చేయబడునని ఉప కులపతి వివరించారు. వీరిలో వివిధ కోర్సులలో ఉత్తమ ప్రతిభ కనుపరచిన 60 మంది విద్యార్థులకు భారత ఉప రాష్ట్రపతి, రాష్ట్ర గవర్నర్‌ల చేతుల మీదుగా బంగారు పతకాలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ విశ్వ విద్యాలయం ద్వారా అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుచున్నదని ఉప కులపతి ఆచార్య సుదర్శన రావు తెలిపారు. కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సాయి ప్రసాద్
మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీ ఉదయం నుండి సంబంధిత విద్యార్థులు తమ గుర్తింపు కార్డులను అందజేసి, అడ్మిట్ కార్డులను పొందవచ్చునని, దీనికి గాను ఆర్ట్స్, సైన్స్, కామర్స్ అండ్ మేనేజ్ మెంట్ విభాగాలకు సంబంధించి వేరు వేరుగా మూడు హెల్ప్ డస్క్ లను ఏర్పాటు చేయడం జరుగుతుందని అయన తెలిపారు.

Post a Comment