అర్ధరాత్రి ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

అమరావతి: అర్ధరాత్రి ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.  పాలనా వికేంద్రీకరణను అధికారికంగా ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది. పాక్షిక న్యాయ విభాగమైన విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ చైర్మన్ సభ్యుల ఆఫీస్‌లను కర్నూలుకు తరలిస్తున్నట్లు ఏపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఈ విభాగాలన్ని వెలగపూడి సచివాలయంలో ఉండగా ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంతో ఇవన్నీ కర్నూలుకు తరలించనున్నట్లు అధికారిక ప్రకటన విడుదలైంది. ఈ విభాగాలన్నింటికి అవసరమైన బిల్డింగ్‌లను ఏర్పాటు చేయాలని ఆర్‌అండ్‌బీ  కర్నూలు కలెక్టర్‌కు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు అనుమతి లేకుండా ఏ ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా తరలించరాదని గతంలో న్యాయస్థానం హెచ్చరించింది. కానీ పరిపాలన సౌలభ్యం కోసం అంటూ ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. న్యాయ, న్యాయ సంబంధిత కార్యాలయాలన్నింటిని కర్నూలులో పెడతామని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget