అతిసారపై పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉన్నాం

- కాచి వడపోసిన నీటినే తాగండి

- కమిషనర్ పివివిస్ మూర్తి

నెల్లూరు, జనవరి 03, (రవికిరణాలు) : నగరంలో అతిసార వ్యాధి తీవ్ర స్థాయిలో ప్రబలుతోందన్న ప్రచారం కేవలం అపోహ మాత్రమేనని, వ్యాధి నివారణకు అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుంటూ అప్రమత్తంగా ఉన్నామని కమిషనర్ పివివిస్ మూర్తి వెల్లడించారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో అతిసార వ్యాధిపై సమీక్షా సమావేశాన్ని ఆయన కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. సమీక్ష అనంతరం విలేకరులతో కమిషనర్ మాట్లాడుతూ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల గణాంకాల ప్రకారం డిసెంబరు నెల 12వ తేదీ నుంచి నమోదైన 227 కేసులలో రోగుల నమూనాలను లేబరేటరీల్లో పరీక్షలు జరిపారని, కేవలం
వ్యక్తిగత అపరిశుభ్రతే వారందరి వ్యాధికి ప్రధాన కారణమని తేలిందని పేర్కొన్నారు. నగర పాలక సంస్థ సరఫరా చేసే మంచినీటిని అన్ని డివిజనుల్లో పటిష్టంగా పరీక్షలు జరుపుతున్నామని, కలుషిత నీరు ఏ ప్రాంతంలోనూ సరఫరా జరగడం లేదని కమిషనర్ స్పష్టం చేసారు. కాచి వడపోసిన నీటినే తాగడం, వీలయినంతగా బయట హోటళ్లలో మాంసాహార వంటకాలను తినడం తగ్గించడం, వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటే అతిసార వ్యాధిని నివారించవచ్చని కమిషనర్ పేర్కొన్నారు. కుటుంబంలో ఒకరికి మాత్రమే వ్యాధి రావడం, ఒకే ప్రాంతంలో ఎక్కువ మందికి వ్యాధి రాకపోవడం, వేరు వేరు ప్రాంతాలనుంచి కేసులు నమోదు కావడం వంటి అంశాలతో మున్సిపల్ కలుషిత మంచినీరు వ్యాధికి కారణం కాదని స్పష్టంగా తెలుస్తోందని వివరించారు. వ్యాధి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని నివారణా చర్యలకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించామని కమిషనర్ స్పష్టం చేసారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget