జిల్లాలో దిశ చట్టంను అమలుకు పటిష్ట చర్యలు - యస్పి

వస్ స్టాప్ సెంటర్ (సఖి) నందు కూడా స్పందన కార్యక్రమాన్ని నిర్వహించండి -జిల్లా యస్పి 
జిల్లాలో వస్ స్టాప్ సెంటర్ (సఖి) ఉమెన్ పోలీస్ స్టేషన్ ల పనితీరు చాలా బాగుంది
నెల్లూరు, జనవరి 07, (రవికిరణాలు) : మంగళవారం జిల్లా యస్పి భాస్కర్ భూషణ్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ప్రాంగణంలో ఉన్న సఖి (ఒస్ స్టాప్ సెంటర్) నందు జనవరి నెలను "దిశ నెల"గా ప్రకటించిన సందర్భాన్ని పురస్కరించుకొని ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ శాఖ వారు "ఆపదలో ఉన్న మహిళలకు ఆపన్న హస్తం" అనే నినాదంతో ఏర్పాటు చేసిన పోస్టర్ ను పలు జిల్లా అధికారుల సమక్షంలో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జరిగిన ఒస్ స్టాప్ సెంటర్ (సఖి) అవగాహన కార్యక్రమం గురించి జిల్లా యస్పి మాట్లాడుతూ మహిళలపై జరిగే పలు నేరాలు గృహ హింస, అత్యచారులు, లైంగిక వేధింపులు, మహిళల అక్రమ రవాణా, మైనర్ బాలికలపై లైంగిక దాడులు, బాల్య వివాహాలు, సైబర్ నేరాలపై కౌన్సెలింగ్ నిర్వహించేందుకు సుశిక్షితులైన సిబ్బందితో పాటు అన్ని సదుపాయాలు ఈ సెంటర్ ల నుండి పొందవచ్చని తెలిపారు. మన రాష్ట్రంలో "దిశ"పై స్పెషల్ ఫోకస్ ఉన్నందున మహిళల భద్రత కోసం సఖి మరియు దిశ మహిళా పిఎస్‌ లు మరింత సమన్వయముతో పని చేసి, మంచి ఫలితాలు రాబట్టాలి అని, ఈ క్రమంలో జిల్లా పోలీసు వైపు నుండి అన్నీ సహాయ సహకారాలు, అందండలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.జిల్లా యస్పి మాట్లాడుతూ వస్ స్టాప్ సెంటర్ (సఖి) లో మహిళల సమస్యలపై చాలా మంచిగా కౌన్సెలింగ్ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించడం జరిగిందని, ఓఎస్‌సి సిబ్బంది పనితీరు అద్భుతంగా ఉందని, వీరితో పాటు మహిళా పోలీస్ స్టేషన్ సిబ్బందిని కూడా ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో యస్పి తో పాటు మున్సిపల్ కమీషనర్ పి.వి.వి.యస్. మూర్తి, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆర్‌జెడి శారద, ఉమెస్ పిఎస్‌ డిఎస్‌ శ్రీధర్, ఐసిడిఎస్‌ ప్రాజెక్ట్ డైరెక్టర్ సుధా భారతి, ఏపిడి శేషకుమారి, ఓఎస్‌సి అడ్మిస్ ఎస్‌.సహనాస్, పారా లీగల్ జోష్న, కేసు వర్కర్ నగ్మా, కౌన్సెలర్ కుమారి కమల పాల్గొన్నారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget