ఎన్‌ఆర్‌సి, సిఏఏ బిల్లు పై మురళీధర్‌రావు ప్రెస్‌మీట్
నెల్లూరు, జనవరి 8, (రవికిరణాలు) : మతపరమైన దేశ విభజనకు ప్రధానకారణం కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు అని ఎన్‌ఆర్‌సి, ఎన్‌పిఆర్,సిఏఏ చట్టాలను బూచీగా చూపి ప్రధాని నరేంద్రమోది ప్రభుత్వంను అప్రతిష్టపాలు చేయడానికి ఈ రెండు పార్టీలు మైనార్టీలను పావులుగా వుపయోగించుకుంటూ భారతీయ ముస్లీములలో ఒక రకమైన అభద్రత భావంను రెచ్చకొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు మండిపడ్డారు. బుధవారం నెల్లూరు బిజెపి జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతదేశంలో వున్న ముస్లీమ్స్ ఎప్పటికి భారతీయులేనని వారి హక్కులను ఎవరు ప్రశ్నించలేరని చెప్పారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు భారత్, సురేంద్రరెడ్డి, ఆంజనేయులురెడ్డి, ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.
Post a Comment