కలువాయి, జనవరి 22, (రవికిరణాలు) : తేది 18-01-2020 రాత్రి కలువాయ మండలం చిపినాపిగ్రామంలో ఎవరో గుర్తు తెలియని దొంగలు ఇంటిలోనికి ప్రవేశించి ఇంటిలో వున్న బ్యాగు దొంగిలించుకుని పోయి అందులో వున్నా రూ.3,30,000విలువ గల బంగారు ఆభరణాలు దొంగిలించుకుని పోయినారు అని రాబడిన రిపోర్ట్ మేరకు కలువాయి పోలీసు స్టేషన్ సబ్-ఇన్స్పెక్టర్ కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు ప్రారంభించినారు. దర్యాప్తులో ఆత్మకూరు డిఎస్పి ఎస్.మక్బుల్ పర్యవేక్షణిలో పొదలకూరు ఇన్స్పెక్టర్, కలువాయి సబ్-ఇన్స్పెక్టర్ బుధవారం ఉదయం వారి సిబ్బంది సహాయముతో ముద్దాయి గోగుల శివయ్య అను అతనిని వేరుబోట్లపల్లి
బస్ షెల్టర్ వద్ద అదుపులోనికి తీసుకోని విచారించగా అతను కలువాయ మండలం చీపినాపి గ్రామంలోని ఓ ఇంటిలో దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. అతని వద్ద నుండి సుమారు మొత్తం 11 సవర్లు వాటి విలువ రూ.3,30,000 గల వస్తువులు స్వాధీనం పరుచుకున్నారు.

Post a Comment