-సోమవారం ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రంలో భాషానిపుణులతో మధ్యాహ్న భోజన సమావేశం
-హాజరుకానున్న ఏపీ గవర్నర్, కేంద్ర హెచ్చార్డీ మంత్రి
మంగళవారం విక్రమసింహపురి వర్సిటీ స్నాతకోత్సవానికి హాజరు గౌరవ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు 20, 21 తేదీల్లో నెల్లూరులో పర్యటించనున్నారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చెన్నై నుంచి సోమవారం ఉదయం 11 గంటలకు వెంకటాచలం రైల్వేస్టేషన్ చేరుకుంటారు. అక్కడినుంచి వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్టుకు ఉపరాష్ట్రపతి చేరుకుంటారు. ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం నిర్వహణకు
సూచనలు అందించేందుకు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశం నలుమూలలనుంచి వచ్చిన తెలుగుభాషాకోవిదులు, నిపుణులు, అభిమానులకు సరస్వతి నగర్ లోని బీఎంపీటీసీ హాల్ లో మధ్యాహ్నం 12.45 గంటలకు ఏర్పాటుచేసిన విందులో ఆయన పాల్గొంటారు. వీరందరితో కలిసి సాయంత్రం 4.15 గంటలకు స్వర్ణభారత్ ట్రస్టులో ‘భువన విజయం’ సాంస్కృతిక కార్యక్రమాన్ని వీక్షిస్తారు. 21వ (మంగళవారం) ఉదయం 8 గంటలకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశంక్ గారితో కలిసి ‘అక్షర’ విద్యాలయాన్ని సందర్శిస్తారు. అనంతరం ఉదయం 9.30 గంటలకు సరస్వతి నగర్ లోని దీన్ దయాళ్ అంత్యోదయ భవన్
లోని ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రాన్ని మంత్రితో కలిసి ఆయన సందర్శిస్తారు. ఉదయం 11గంటలకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, కేంద్ర హెచ్చార్డీ మంత్రితో కలిసి స్వర్ణభారత్ ట్రస్టులోని ప్రజామందిరంలో జరుగుతున్న తెలుగు భాషాకోవిదుల వర్క్ షాప్ ముగింపు సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం 3.30 గంటలకు శ్రీ వెంకటేశ్వర కస్తూర్బా కళాక్షేత్రంలో జరగనున్న విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో ఆయన పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు వెంకటాచలం రైల్వేస్టేషన్ నుంచి చెన్నైకి బయలుదేరి వెళ్తారు.

Post a Comment