దర్శనానికి 3 కంపార్టుమెంట్లలో భక్తులు
నాలుగు గంటల్లోనే దర్శనం
బుధవారం స్వామిని దర్శించుకున్న 70 వేల మంది
తిరుమలలో భక్తుల రద్దీ పల్చగా ఉంది. ఈ ఉదయం స్వామి సర్వదర్శనానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 3 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివుండగా, వారికి నాలుగు గంటలలోపే దర్శనం కల్పిస్తామని అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ టోకెన్లు, దివ్య దర్శనం, రూ. 300 ప్రత్యేక దర్శనం టోకెన్లు కలిగివున్నవారికి రెండు గంటల సమయం పడుతోందని అన్నారు. నిన్న స్వామివారిని సుమారు 70 వేల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. నేడు స్వామివారి సేవలకు సంబంధించి 50 సుప్రభాతం, 10 అభిషేకం, 80 కల్యాణోత్సవం టికెట్లను లక్కీడిప్ లో జారీ చేశామని అన్నారు.

Post a Comment