ఎన్టీఆర్ స్పూర్తితో అమరావతి కోసం ఉద్యమించాలి - బీద రవిచంద్ర

స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 24 వ వర్ధంతి సందర్భంగా ఆయన స్ఫూర్తితో రాజధానిని అమరావతిలొనే కొనసాగించాలని ఉద్యమించాలని శనివారం కోవూరు పెళ్లకూరు కాలనీ సెంటర్ లో జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఎన్టీఆర్ 24 వ వర్ధంతి కార్యక్రమము లో ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులు అర్పించిన అనంతరం బీద రవిచంద్ర మాట్లాడుతూ ఎన్టీఆర్ మరణించి 24 సంవత్సరాలు గడిచిన నేటికి తెలుగుప్రజలు ఆయనను గుర్తుపెట్టుకొని పెద్దఎత్తున వర్ధంతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని,ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించి ఎంతో మంది బడుగు,బలహీనవర్గాల వారికి రాజకీయ భవిష్యత్తు ఇచ్చారని,దేశములోనే మొట్టమొదటిగా పెదప్రజల కోసం సంక్షేమ కార్యాక్రమలు ప్రవేశపెట్టారని,పరిపాలనలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్ట తెలుగుప్రజలు గుండెల్లో చిరస్థాయిగా నిలబడి పోయారని,రాష్ట్రము 7 నెలల వైస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో అన్నిరంగాల్లో వెనుకబడిపోయనదని,పేద ప్రజలకు కడుపునిండా భోజనము పెడుతున్న అన్న క్యాంటీన్లను మూసివేశారని,అందరి ఆమోదంతో ఏర్పాటు చేసిన రాజధానిని అమరావతి నుండి మార్చటానికి ప్రయత్నాలు చేస్తున్నారని, ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మన మందరము ప్రతిన పూని రాజధానిని అమరావతి నుండి తరలించాలనే సర్రే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమించాలని అన్నారు.ఈ కార్యాక్రమములో పాల్గొన్న కోవూరు మాజీ శాసనసభ్యుడు పొలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటారని,పేద ప్రజల కనీస అవసరాలైన కూడు, గుడ్డ, గూడు ఏర్పాటు చేసారని, తెలుగుగంగ ప్రాజక్టు నిర్మించి నెల్లూరు జిల్లా రైతాంగం కు ఎంతో ప్రయోజనం కల్పించారని అన్నారు చేజర్ల వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ ఎన్టీఆర్ మాండలిక వ్యవస్థను తీసుకొచ్చి అన్ని ప్రభుత్వ కార్యాలయాలను మండల కేంద్రంలో ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేస్తే, వైయెస్ జగన్మోహన్ రెడ్డి ఉరికొక రాజధాని పెట్టి ప్రజలనుఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారని అన్నారు.
  ఈ సందర్భంగా కోవూరు పిఆర్ సెంటర్లలో ,పెద్ద పడుగుపాడు లో పెద్ద ఎత్తున అన్న దానం కార్యక్రమము నిర్వహించడము జరిగినది,కోవూరు బజారుసెంటర్లో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఏలూరు కృష్ణయ్య, దారా విజయబాబు, పెనుమల్లి శ్రీహరిరెడ్డి, పంతంగి రామారావు, బాల రవి, జెట్టి గోపిరెడ్డి, కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి, కుంకాల జనార్దన్, గునుపాటి రవీంద్రరెడ్డి, బత్తల రమేష్, ఉయ్యేరు వేణు, పాశం పరందామయ్య, పాలపర్తి శ్యాం, సాయి రోశయ్య, తదితరులు పాల్గొన్నారు



Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget