స్పందన అర్జీల పట్ల ప్రత్యేక శ్రద్ద

నెల్లూరు, జనవరి 13, (రవికిరణాలు) : ప్రజల నుండి అందే స్పందన అర్జీల పట్ల ప్రత్యేకశ్రద్ద వహించి త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టరు ఎమ్.వి.శేషగిరిబాబు అధికారులను ఆదేశించారు.సోమవారం జిల్లా కలెక్టరు కలెక్టరేట్లో సంయుక్త కలెక్టరు డా.వి. వినోద్ కుమార్, రెండవ సంయుక్త కలెక్టరు కె.కమలకుమారి,జిల్లా రెవెన్యూ అధికారి జి.మల్లిఖార్జున, తెలుగుగంగ ప్రత్యేక కలెక్టరు నాగేశ్వరరావులతో కలసి స్పందన కార్యక్రమం నిర్వహించి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ప్రజల సమస్యలను ఎంతో ఓపికగా ఆలకించి సంబంధిత అధికారులను పలిపించి అర్జీలను సత్వరమే పరిష్కరించాలని
సూచించారు. జిల్లాలో యిప్పటి వరకు 46,767 స్పందన అర్జీలు అందాయని, అందులో 44,220 అర్జీలను పరిష్కరించారని, యింకనూ 2547 అర్జీలు వెంటనే పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో సాంఘక సంక్షేమశాఖ, ఉప సంచాలకులు శ్రీ జీవ పుత్ర కుమార్, గురుకులాల సమన్వయకర్త యానదయ్య,జిల్లా సహకార అధికారి తిరుపాల్ రెడ్డి, ఎల్.డి.ఎం. రాంప్రసాద్ రెడ్డి, గృహనిర్మాణ సంస్థ పి.డి. ప్రసాద్, డి.ఎస్.ఓ బాలకృష్ణారావు, డ్వామా పి.డి. జ్యోతిబసు, సమగ్ర శిక్ష పి.ఓ. బ్రహ్మానంద రెడ్డి తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget