- రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్ ఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
నెల్లూరు, జనవరి 22, (రవికిరణాలు) : నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని అల్లీపురం, పెద్దచెరుకూరు, గుడిపల్లిపాడు, నరుకూరుకు వెళ్ళే రోడ్డు అద్వానంగా ఉందని, ఈ రోడ్డును తక్షణం మరామత్తులు చేసి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆర్ అండ్ బి యస్.ఇ., డి.ఇ.ని రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్ ఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కోరారు.ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్ ఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ, పెద్దచెరుకూరు, అల్లీపురం, గుడిపల్లిపాడు, నరుకూరు ఈ రోడ్డుగుండా ప్రజలు పోవాలంటే నరకం చూస్తున్నారని, బైక్ పై వెళ్ళే వారు గాయాలపాలై ఆసుపత్రులపాలవుతున్నారని, ఈ
రోడ్డును యుద్ధ ప్రాతిపదికన మరామత్తులు చేసి, ప్రజల బాధలను తీర్చాలని ఆర్ అండ్ బి యస్.ఇ., డి.ఇ. లను కోరారు. దీనిపై అధికారులు స్పందిస్తూ 15 రోజుల లోపల ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్ ఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డికి హామీ ఇచ్చారు. పై కార్యక్రమంలో ఇసనాక శ్రీనివాసులు 'రెడ్డి, పందిళ్ళపల్లి శ్రీధర్ రెడ్డి, నెల్లూరు పవన్ కుమార్ రెడ్డి, ఏ.ఎమ్.సి. ఛైర్మన్ ఏసు నాయుడు, మిద్దె మురళీ కృష్ణ యాదవ్, శ్రీధర్ రెడ్డి, మురళి, దశయ్య, రామ్ మోహన్ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Post a Comment