కోవూరు, జనవరి 20, (రవికిరణాలు) : చలో అసంబ్లీ పిలుపు నేపథ్యంలో కోవూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి హౌస్ అరెస్ట్ చేసిన పోలీసు అధికారులు. చేజర్ల హౌస్ అరెస్టు తెలుసుకొని చేజర్ల నివాసంకు పెద్ద ఎత్తున చేరుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యాకర్తలు. చేజర్ల నివాసం వద్ద ఉద్రిక్తత, చేజర్ల తో సహా తెలుగుదేశం పార్టీ నాయకులను అరెస్ట్ చేసి కోవూరు పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ సందర్భంగా చేజర్ల వేంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలందరికీ భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని,ఎవరికి తీసిన విధంగా వారు ఉద్యమాలు చేసుకోవచ్చని డి జిపి ప్రకటిస్తారు,ఇక్కడేమో చలో అసంబ్లీకి బయలుదేరుతుంటే సోమవారం ఉదయమే కోవూరు పోలీసుల వచ్చి హౌస్ అరెస్ట్ చేసారని, తదనంతరం తెలుగుదేశం పార్టీ నాయకుల ను నన్ను అరెస్టు చేసి కోవూరు పోలీస్ స్టేషన్ కు తరలించారని,చట్టానికి లోబడి శాంతియుతంగా మేము నిరసనలు తెలియచేయటానికి మేము వెళుతుంటే పోలీసులు అరెస్టు చేయడం దారుణమని, ముఖ్యమంత్రి వై యెస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పోలీస్ రాజ్యాన్ని నడుపుతున్నారని,భారత దేశ చరిత్రలో డమ్మీ కాన్యాయి పెట్టుకొని సచివాలయంకు వెళ్లిన ముఖ్యమంత్రిని ఇంతవరకు చూడలేదని,మాట్లాడితే కడప పౌరసం అని చెప్పే ముఖ్యమంత్రి దొంగ దారులు ఏర్పాటు చేసుకొని అసంబ్లీకి వెళుతున్నారు,ప్రతిపక్షం లో ఉన్నప్పుడు అమరావతిని రాజధానిగా ఆమోదించి,ఎన్నికల సమయములో మేము అమరావతి లొనే రాజధానిని కొనసాగిస్తామని చెప్పి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన తరువాత ఎరు దాటి తెప్ప తగలేసినట్లు ముఖ్యమంత్రి రాజధానిని తరలించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని,ముఖ్యమంత్రి గారు అమరావతి నుండి రాజధానిని తరిస్తానని చెప్పి తమ ఎన్నికలకు వెళ్లి ప్రజామోదం పొందిన తరువాతి మాత్రమే రాజధానిపై నిర్ణయం తీసుకోవాలని,పోలీసులను అడ్డుపెట్టుకొని ఉద్యమాన్ని అణిచివేయలేరని,అరెస్టులతో మమ్ములను అడ్డుకోలేరని, అమరావతి లొనే రాజధానిని కొనసాగిస్తామని చెప్పే వరకు ఉద్యమము ఆగదని చెప్పారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకుల దారా విజయబాబు, పంతంగి రామారావు, కలికి సత్యనారాయణ రెడ్డి, ఇంటూరు విజయ్, ఒబ్బారెడ్డి మల్లికార్జున రెడ్డి, సోమవరపు సుబ్బారెడ్డి, మహమ్మద్, మౌలాలి, సాయి రోశయ్య తో సహా పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులను అరెస్టు చేశారు.
Post a Comment