అల్యూమినియం గనులను దోచుకునేందుకే రాజధాని మార్పు - మాజీ నుడా చైర్మన్

నెల్లూరు, జనవరి 13, (రవికిరణాలు) : నెల్లూరు నగరంలోని స్థానిక టిడిపి కార్యాలయంలో నుడా మాజీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి విలేకర్ల సమావేశంను నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ 34 వేల ఎకరాలు ఇచ్చిన రైతుల రక్తంతో అమరావతి తడిచిపోతుందని, మహిళా రైతులనే కనికరం కూడా లేకుండా పోలీసులు దాష్టికానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. అమరావతిని అంధకారంలోకి నెట్టేసిన అసమర్థ సీఎం జగన్.. పీఠాధిపతి మాటలు విని రైతుల పొట్ట కొడతారా..? విశాఖపట్నంలో ఉండే బాక్సైట్, అల్యూమినియం గనులను దోచుకునేందుకే రాజధాని మార్పు..సీఎం జగన్ మూర్ఖంగా,
అహంకారంతో వ్యవహరిస్తున్నారు..అమరావతి అంతా కాశ్మీర్ బార్డర్ ను తలపిస్తుంది..
తమ న్యాయపరమైన పోరాటాలను పోలీసులతో ఆపలేరు..అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని వైసీపీ నేతలు, పోలీసులుగుర్తు పెట్టుకోవాలి..టీడీపీ హయాంలో పోలీసులకు స్వేచ్చనిస్తే.. ఆ పోలీసులే ఇప్పుడు రైతులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారుముగ్గుల పోటీలకు కూడా అనుమతి ఇవ్వని పరిస్థితి ఉందంటే... వైసీపీ నేతల్లో ఎంత అభద్రతా భావం ఉండే అర్థం చేసుకోవచ్చు.. సీఎం పదవికి జగన్ కళంకం తెస్తే... మంత్రులు కూడా అదే దారిలో వెళ్తున్నారు..ద్వారంపూడి చంద్రశేఖర్ ఒక లాపుట్ లాంటోడు.. అందుకే ఇష్టమొచ్చినట్లు
మాట్లాడుతున్నాడు..చంద్రబాబును తిడితే మంత్రి పదవి వస్తుందని కొందరు సన్నాసులు ప్రయత్నం చేస్తున్నారు..పాపం పండితే శిశుపాలుడికి పట్టిన గతే జగన్ కు పడుతుంది.. అమరావతి మహిళ రైతుల ఆవేదన, కన్నీటి వల్లే జగన్ మళ్ళీ కోర్ట్ మెట్లు ఎక్కుతున్నాడు
రాష్టానికి సీఎం జగన్ దరిద్రం పట్టినట్లు పట్టుకున్నాడు. ఆదర్శంగా ఉండాల్సిన మంత్రులు, ఎమ్మెల్యేలుబూతుల సంస్కృతికి తెర లేపారు..మాయల పక్కిర్ లాంటి మంత్రి కొడాలి నానికి, వైసీపీ నేతలకు రోజులు దగ్గర పడ్డాయి.. ఈ కార్యక్రమంలో అధికార ప్రతినిధి హరిబాబు యాదవ్, నాయకులు జెన్నీ రమణయ్య, మేకల.రమూర్తి, ఆర్‌కెటి.శేషియా, ఖాజావాలి, మోయుద్దీన్, అంచురి.శ్రీనివాసులు నాయుడు,హనుమంతు,పసుపులేటి మళ్ళీ కార్జున్,సుకేశ్,సేసి,ఖాదర్ తదితరులు పాల్గొన్నారు.


Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget