- కమిషనర్ పివివిస్ మూర్తి
పోలియో మహమ్మారిని అంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ పల్స్ పోలియో కార్యక్రమంపై అవగాహన పెంచుకుని చిన్నారులకు చుక్కల మందు వేయించాలని నగర పాలక సంస్థ కమిషనర్ పివివిస్ మూర్తి ఆకాంక్షించారు. జాతీయ రోగ నిరోధక దినోత్సవం సందర్భంగా స్థానిక వేదాయపాలెంలోని నగర పాలక సంస్థ పాఠశాలలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమంలో ఆయన ఆదివారం పాల్గొని చిన్నారులకు చుక్కల మందు వేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని ప్రధాన కూడళ్లు, పాఠశాలల్లో చుక్కల మందు పంపిణీ కార్యక్రమం చేపట్టామని, ప్రతీ చిన్నారికీ పోలియో చుక్కలు అందేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. ప్రయాణంలో ఉన్న చిన్నారులకోసం ప్రత్యేకంగా బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లలో పల్స్ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించామని కమిషనర్ వెల్లడించారు.

Post a Comment