మూడు రాజధానులకు మద్దతుగా బైక్ ర్యాలీ

నెల్లూరు, జనవరి 27, (రవికిరణాలు) : శాసనసభ, శాసనమండలి సాక్షిగా తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్య విలువలను హరించినందుకు నిరసనగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డా|| పి.అనీల్ కుమార్, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పిలుపు మేరకు ఎస్ఆర్సిపి యువజన విభాగం జిల్లా అధ్యక్షులు పి.రూప కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో నగరంలోని గాంధీబొమ్మ నుంచి మద్రాస్ బస్టాండు, కె.వి.ఆర్. పెట్రోల్ బంకు, ఆర్టిసి, వీఆర్సీ,రామలింగాపురం, మినీ బైపాస్ మీదుగా విజయమహల్ గేటు వరకు యువజన విభాగం నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షులు తాటి వెంకటేశ్వరరావు, యువజన విభాగ నగర అధ్యక్షులు గంధం సుధీర్ బాబులు పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా తాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 2014లో విడిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని కొత్త ప్రభుత్నం ఏర్పాటు చేసిన చంద్రబాబునాయుడు అమరావతిని సింగపూర్‌లా చేస్తానని మాయమాటలు చెప్పి అమరావతిని భ్రమరావతిగా చూపించారన్నారు. కేవలం తన బినామీలకు ముందుగా రాజధాని విషయం తెలిపి ఆస్తులు కూడబెట్టి అమరావతిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్ ను మాత్రమే అభివృద్ధి చేశారని, రాష్ట్రం విడిపోయినప్పుడు మన రాష్ట్రం అనాథగా మిగిలిపోవడం ప్రజలందరూ చూశారన్నారు. ఇలాంటి పరిణామాలు పునరావృతం కాకుండా ముఖ్యమంత్రి రాష్ట్రంలో 3 రాజధానులు ఏర్పాటు చేస్తుండడం హర్షించదగ్గ విషయమన్నారు. రాష్ట్రంలో 3 రాజధానులు ఏర్పాటు చేస్తే కేవలం అమరావతిలో భూములు కొన్న టిడిపి నాయకుల బినామీలు మాత్రమే వ్యతిరేకిస్తూ 3 రాజధానులు వద్దంటూ నాటకాలాడుతున్నారన్నారు.గంధం సుధీర్ బాబులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘంగా ప్రజాసంకల్ప యాత్ర చేస్తూ ప్రతి ప్రాంతంలోని సమస్యలు తెలుసుకొని, ఏ ప్రాంతాలైతే వెనుకబడి ఉన్నాయో, ఏవి అభివృద్ధి చెందలేదో దానిపై ఏమి చేయాలన్న ఆలోచన చేశారన్నారు.రాష్ట్రానికి 3 రాజధానులుంటే వెనుకబడిన ప్రాంతాలు, అలాగే అభివృద్ధి చెందిన వైజాగ్ ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేస్తే ఆర్థిక వనరులకు సరిపడే విధంగా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే ఆదాయం బాగుంటుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచించడం హర్షించదగ్గ విషయమన్నారు. అమరావతిని తీసేస్తామని ఎక్కడా ప్రకటించలేదన్నారు. వైజాగ్ ను రాజధాని చేస్తే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, పరిపాలన బాగుంటుందన్న మంచి ఆలోచనతో ముఖ్యమంత్రి 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నారన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 7 నెలల్లోనే ఇంత అభివృద్ధి చెందితే మరో నాలుగున్నరేళ్ళలో ఇంకా అభివృద్ధి చేస్తారని, దీంతో ఓర్వలేక టిడిపి నాయకులు
ఇష్టమొచ్చినట్లు ప్రకటనలిస్తూ ప్రజలను ప్రలోభపెడుతున్నారన్నారు. అందుకు నిరసనగా 3 రాజధానులుంటే రాష్ట్రాభివృద్ధి ఉంటుందన్న ఉద్దేశ్యంతో మంత్రి అనీల్ కుమార్, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పిలుపు మేరకు 3 రాజధానులకు మద్దతుగా యువజన విభాగం, వైఎస్ఆర్ సిపి నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వంగాల శ్రీనివాసులురెడ్డి, మజ్జిగ జయకృష్ణారెడ్డి, చేజర్ల మహేష్, బోయిళ్ళ సురేష్ రెడ్డి, సాకేష్ రెడ్డి, బి.హరిప్రసాద్ నాయుడు, యాకసిరి శరత్ చంద్ర, సింహాద్రి, మదన్, శేషు, పెంచలరెడ్డి, మల్లి, శైలేంద్ర, నాగరాజారెడ్డి, మేకల సతీష్, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget