నెల్లూరు జిల్లా, వెంకటాచలం మండల పరిషత్ కార్యాలయంలో సర్వేపల్లి నియోజకవర్గ వివిధ శాఖల అధికారులతో అభివృద్ధి, సంక్షేమ పథకాల పై సమీక్షా సమావేశం నిర్వహించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.గ్రామ సచివాలయ ఉద్యోగులకు మరియు గ్రామ వాలంటీర్లకు ప్రభుత్వం అందజేస్తున్న స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాకాణి.
అసంపూర్తిగా ఉన్న అంగన్వాడీ భవనాల వివరాలు అందజేస్తే పూర్తి చేస్తాం, అద్దె గృహాలలో నిర్వహిస్తున్న అంగన్వాడి భవనాలకు కొత్త భవనాలను మంజూరు చేయిస్తాం. పూర్తిస్థాయిలో నిధులు మంజూరు అయితే తప్ప అరకొర నిధులతో నిర్మాణాలు ప్రారంభించవద్దు. చాలిచాలని నిధులతో ప్రారంభించిన నిర్మాణాలు అసంపూర్తిగా, పనికిరాకుండా పోతున్నాయి. ఉపాధి హామీ పనులపై దృష్టి సారించి, సాధ్యమైనంత ఎక్కువ మంది కూలీలకు పని కల్పించండి.
గృహ నిర్మాణానికి సంబంధించి లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేపట్టండి.
అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇళ్లస్థలాలు అందజేయడంతో పాటు ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడం మన బాధ్యత. గ్రామాలలో అవసరమైన మౌలిక సదుపాయాలను గుర్తించి, నివేదికలు సిద్ధం చేయండి.
గ్రామాలకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తాం.
గ్రామ వాలంటీర్లకు సెల్ ఫోన్లు అందజేయడం సంతోషం. గ్రామ వాలంటీర్లు బాధ్యతయుతంగా విధులు నిర్వహించి, ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు తీసుకొని రండి.
Post a Comment