65 లక్షలు విలువ గల గంజాయి, 15 లక్షలు విలువ చేసే వాహనాలు స్వాధీనం
భద్రాచలం నుండి తమిళనాడు లోని తిరుచ్చికి, అక్కడ నుండి శ్రీలంకకు స్మగ్లింగ్ చేస్తున్న ముఠా
నెల్లూరు, జనవరి 11, (రవికిరణాలు) : మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని జిల్లా యస్పి భాస్కర్ భూషణ్ జిల్లా భాద్యతలు తీసుకున్న తొలి రోజునే ఇచ్చిన ఆదేశాల మేరకు సిసిఎస్ హైవే పోలీస్ స్టేషన్ల అధికారులు వీటి అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘాను కొనసాగించడం జరుగుతున్నది. ఇందులో భాగంగా భద్రాచలం నుండి తమిళనాడుకు గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా ముందస్తు సమాచారంతో నెల్లూరు తడ పిఎస్ పరిధిలో 180 కె.జి. లు, ఒక వాహనం తరువాత కావలి రూరల్ పరిధిలో మరో వాహనం, 250 కె.జి.లు, మొత్తం 430 కె.జి.ల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు సిసిఎస్ సిఐ అందించిన విశ్వసనీయ సమాచారం మేరకు, సూళ్ళూరుపేట పోలీసులు అప్రమత్తం అయి వారి చెక్ పోస్టుల వద్ద కాపు కాయడం జరిగింది. ఈ క్రమంలో ఒక కారు అనుమానాస్పద స్థితిలో శ్రీసిటీ
జంక్షన్ వద్ద పోలీసు బృందాలను చూసి అతి వేగంగా తడ చెక్ పోస్టు వైపు దూసుకుపోయింది. అప్రమత్తమైన పోలీసు సిబ్బంది కారును చేజ్ చేసి శీకాళహసి రూట్ లో తప్పించుకునే ప్రయత్నంలో ఉండగా కారును నిలువరించి ఒక ముద్దాయిని పట్టుకొనగా మరొక వ్యక్తి పారిపొయినాడు. ఈ క్రమంలో సదరు కారు, ఒక మోటారు బైకును డీకొట్టడం జరిగింది. తడ ఎస్సై కారు నుండి 180 కె.జి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

Post a Comment