ఉత్సాహంగా ప్రారంభమైన "పోలీస్ స్పోర్ట్స్ అండ్‌ గేమ్స్ మీట్-2020"

నెల్లూరు జిల్లా వార్షిక పోలీస్ స్పోర్ట్స్ అండ్‌ గేమ్స్ మీట్-2020 వేడుకలు ఉత్సాహవంతమైన వాతావరణంలో బుధవారం పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా యస్పి భాస్కర్ భూషణ్ క్రీడలలో పాల్గొనే 5 సబ్ డివిజన్ లు, ఎ.ఆర్. హోం గార్డ్స్ అధికారులు సిబ్బందిచే గౌరవ వందనం స్వీకరించిన అనంతరం క్రీడా జెండాను ఎగురవేసి, శాంతికి చిహ్నం, శుభసూచకంగా పావురాలు, త్రివర్ణ పతాకానికి గుర్తుగా బెలూన్ లను గాల్లోకి వదిలి, తదుపరి ప్రతిజ్ఞ చేసి లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా యస్పి మాట్లాడుతూ 29.01.2020 నుండి 31.01.2020
తేదీ వరకు మూడు రోజుల పాటు జరిగే వార్షిక పోలీస్ స్పోర్ట్స్ అండ్‌ గేమ్స్ మీట్-2020లో 5 సబ్ డివిజన్ లు, ఎ.ఆర్. హోం గార్డ్స్ అన్ని విభాగాల నుండి క్రీడాకారులు 100 మీటర్స్, షాట్ పుట్, 200 మీటర్స్, ఫుట్ బాల్, డిస్కస్ త్రో, లాంగ్ జంప్, వాలీ బాల్, కబడ్డీ, షటిల్, టగ్ ఆఫ్ వార్ మొదలగు విభాగాల్లో పోటీలు నిర్వహించడం జరుగుతుందని, అందరూ క్రీడా స్ఫూర్తితో వ్యవహరించి రెట్టింపు ఉత్సాహంతో ఈ క్రీడల్లో పాల్గొని, ప్రతిభ చూపాలని ఆకాంక్షించారు. శాంతి భద్రతలకు సంబంధించిన నిర్విరామ బందోబస్తి విధుల కారణంగా ప్రతి ఒక్కరూ మానసిక ఉల్లాసం, ఆరోగ్యం, సంతోషం, ఉత్సాహం మరియు ఆహ్లాదకరంగా గడిపేందుకు క్రీడలు
చాలా దోహదం చేస్తాయని, శరీరం ఆరోగ్యంగా ఉంటేనే మనస్సు ఆరోగ్యంగా ఉంటుందనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలన్నారు.జయాపజయాలు అనేవి అనేక అనుకూల, ప్రతికూల పరిస్థితులతో ముడిపడి ఉన్నాయని, కానీ క్రీడా స్పూర్తితో మనం చివరి వరకు పోరాడాలన్నారు. విజయం పొందితే అనుకువతో వ్యవహరించడం, అపజయం పొందితే కుంగిపోకుండా మంచిగా స్వీకరించి ఆయా విషయాలను జీవితానికి అన్వయించుకోవాలని, ఈ క్రీడలు ఒక ఆటవిడుపుగా ఉండాలని ఆకాంక్షించారు. అంతేకాకుండా నెల్లూరు పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ నిర్వహించడం, అందరూ పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది, పాల్గొన్న ప్రతి ఒక్కరు గెలిచినట్లే, మీ సేషన్ లలో కూడా షటిల్, వాలీబాల్ కోర్టులు ఏర్పరుచుకోవాలని సూచిస్తూ ఈ క్రీడలో పాల్గొనే పోలీస్ అధికారులు మరియు సిబ్బంది అలాగే కార్యక్రమానికి విచ్చేసిన మీడియా మిత్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా యస్పితో పాటు అడిషనల్ యస్.పి. (క్రైమ్స్) పి.మనోహర్ రావు, అడిషనల్ యస్పి(ఎ.ఆర్) యస్.వీరభద్రుడు, జిల్లాలోని అందరూ డియస్పి లు, సి.ఐ.లు, యస్.ఐ సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget