శాస్త్రీయ పద్ధతులు, ప్రమాణాలకు అనుగుణంగా ట్రైనింగ్ ప్రోగ్రాం రూపకల్పన - జిల్లా యస్పి
శిక్షణలో అందరూ శారీరకంగా దృడంగా, మానసికంగా చురుకుగా తయారవ్వాలి
అత్యాధునిక ఆయుధాల నిర్వహణ, ఉపయోగం గురించి పూర్తి అవగాహన పొందండి
నెల్లూరు, జనవరి 17, (రవికిరణాలు) : శుక్రవారం నగరంలోని పోలీసు కవాతు మైదానం నందు ప్రతి సంవత్సరం జనవరి నెలలో జరిగే జిల్లా సాయుధ బలగాల సిబ్బంది 2 వారాల వార్షిక సమీకరణ రీఫ్రెష్ ట్రైనింగ్ లో పాల్గొన్న జిల్లా ఏఆర్ ఫోర్స్ అధికారులు, సిబ్బందిని ఉద్దేశించి జిల్లా యస్పి భాస్కర్ భూషణ్ పై వ్యాఖ్యలు చేసినారు.జిల్లాలో పలు కీలక సేవలు అందించే జిల్లా సాయుధ దళం సంక్లిష్ట విభాగం అయినందున ఈ యాన్వల్ మొబలైజేషన్ శిక్షణలో వృత్తిపరమైన నైపుణ్యాలు, మెలుకవలు ఏకాగ్రతతో సాధన చేసి 14 రోజుల రీఫ్రెష్ ట్రైనింగ్ విజయవంతంగా ముగించాలని, ఏఆర్ సిబ్బంది అందరూ క్రమశిక్షణలో మిగిలిన వారికీ
ఆదర్శంగా ఉండాలని, ఉన్నత స్థాయి శారీరక ప్రమాణాలు, మానసిక సమతుల్యత ఈ శిక్షణలో మెరుగుపరుచుకోవడమే కాకుండా, సంవత్సరం పాటు శారీరక ఫిట్ నెస్ స్థాయిని కొనసాగించాలని తెలిపారు. శాస్త్రీయ పద్ధతులు, ప్రమాణాలకు అనుగుణంగా ట్రైనింగ్ ప్రోగ్రాం రూపకల్పన చేయబడిందని, ఎక్కువగా ముఖాముఖి చర్చలకు ప్రధాన్యత కల్పిస్తూ, అత్యాధునిక ఆయుధాలను ఎలా హ్యాండిల్ చేయాలి, పైరింగ్, డ్రిల్, మార్చ్ ఫాస్ట్, మాబ్ కంట్రోల్, విఐపి ఎస్కార్ట్, పిఎస్‌ఓ, బందోబస్తి మొదలగు అన్ని అంశాలలో శ్రద్ధ పెట్టి రీప్రెష్ ట్రైనింగ్ లో నైపుణ్యాలు మెరుగుపరుచుకోవాలని, ఆరోగ్య సంరక్షణ మరియు కుటుంబాలతో ఆనందంగా గడుపుతూ, “లైఫ్ స్టైల్ డిసీజెస్" బారిన పడకుండా ఉండాలని ఈ సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా యస్పి తో పాటు అడిషనల్ యస్.పి.(ఎ.ఆర్) యస్.వీరభద్రుడు, డియస్పి(ఎ.ఆర్) రవీంద్ర రెడ్డి, ఆర్‌ఐ(అడ్మిన్) మౌలాలుద్దిన్, ఆర్‌ఐ(వెల్ఫేర్) చంద్రమోహన్, ఆర్‌ఎస్సై లు సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment