నెల్లూరు, జనవరి 23, (రవికిరణాలు) : గురువారం స్థానిక విఆర్సి సెంటర్ దగ్గర్లో ఉన్న ఏబీవీపీ ఆఫీస్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 123వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఎబివిపి నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి స్మరించుకున్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర కార్యసమితి సభ్యులు గంగాధర్ మాట్లాడుతూ నేతాజీగా పేరుగాంచిన గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ అని కొనియాడారు. అహింసావాదంతో స్వాతంత్రం సాధించలేమని నినదించి ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ స్థాపించారు. భారత జాతీయ సైన్యం ఏర్పాటు లో రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు ఆంగ్లేయుల పై పొరాడేందుకు అజాద్ హింద్ ఫౌజ్ ఏర్పరిచారు అని వ్యాఖ్యానించారు. అతను ఆంగ్లేయుల పై ఒక తూటలాగా దూసుకెళ్లే వారిని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. గాంధీజీ మొదలైన నాయకులందర అహింసావాదం తోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తుంటే ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి అది ఆచరణలో పెట్టిన మహనీయుడు సుభాష్ చంద్రబోస్ అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. స్వాతంత్ర పోరాటంలో భాగంగా 11 సార్లు జైలుకు వెళ్లిన సుభాష్ చంద్రబోస్ ఆంగ్లేయుల కబంధహస్తాల నుంచి భారతమాతను రక్షించేందుకు చలో ఢిల్లీ నినాదాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జోనల్ ఇంచార్జ్ సాయికృష్ణ, యశ్వంత్, శివ, జీత్ జైన్, జయంత్, మురళీకృష్ణ, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
Post a Comment