దేవాలయాలలో కలశాలను దొంగిలించే ఘరానా ముఠా అరెస్టు

తోటపల్లి గూడూరు, డిసెంబర్‌ 24, (రవికిరణాలు) : డిసెంబర్ నెలలో కొత్తపాలెం ఈదూరు గ్రామాలలోని దేవాలయాలలో ద్వజస్థంభానికి కలిగి వుండిన కలశాలను ఎవరో గుర్తు తెలియని దొంగలు వాటిని దొంగిలించినట్లుగా తోటపల్లి గూడూరు పోలీసుస్టేషన్లో ఫిర్యాదులు ఇచ్చారు. ఈ దొంగతనాలను అరికట్టడానికి నెల్లూరు జిల్లా ఎస్పి భాస్కర్ భూషణ్ ఆదేశాల మేరకు డిఎస్పి రాఘవరెడ్డి పర్యవేక్షణలో కృష్ణపట్నం సిఐ ఖాజావళి వారి సిబ్బందితో మూడు చోట్ల వాహనాలు తనిఖీ చేస్తుండగా మంగళవారం రాబడిన సమాచారం ప్రకారం తోటపల్లి గూడూరు ఎస్సై సిబ్బంది రావూరి వారి కండ్రిగ గ్రామంలో వాహన తనికీ చేయుచుండగా ఏపి16ఏజెడ్‌6199 నెంబర్ ప్లేట్ కలిగిన కారు పోలీసు వారిని చూసి ముందుగానే తమ వాహనాన్ని ఆపుకొని కారు దిగి పారిపోతుండగా ఎస్సై సిబ్బంది, పెద్దమనుషుల సమక్షంలో వారిని పట్టుకొని విచారించి
వాహనాన్ని తనిఖీ చేయగా ఆ వాహనంలో దేవాలయాలకు సంబందించిన 3 కలశాలు వున్నాయి. వాటి గురించి ఆరాతీయగా అవి కొత్తపాలెం దేవాలయానికి సంబంధించిన కలశాలు అని ఇంకా యెక్కడెక్కడ దొంగిలించారు ఇంకా ఎంతమంది వున్నారు అని ఆరా తీయగా ఈ దొంగలకు సంబందించి మొత్తం 9 మంది ఒక టీమ్ గా ఏర్పాటు అయ్యి ఎక్కడెక్కడ దొంగతనం చేయొచ్చు అని ముందుగా ప్రణాళిక సిద్ధం చేసుకొని ఈ నేరాలకి పాల్పడుతున్నట్లు మొదటగా సుమారు 1 నెలల క్రితం ప్రకాశం జిల్లాలోని ఉప్పమాగులూరు గ్రామం సమీపంలో ఒక దేవాలయంలో కలశాన్ని దొంగిలించి దుడ్డు రమేశ్ అనే ముద్దాయి వద్ద దాచిపెట్టినట్లు,తరువాత డిసెంబర్ నెల రెండవ వారంలో తోటపల్లిగూడూరు మండలంలోని ఈడూరు గ్రామంలో విష్ణు ఆలయంలో ఒక కలశం దొంగతనం చేసి శీలం వెంకటేశ్వర్లు అనే ముద్దాయి వద్ద దాచిపెట్టినట్లు, కొత్తపాలెం
గ్రామంలోని శ్రీ ఆంజనేయస్వామి వారి దేవాలయంలో 3 కలశాలు దొంగతనం చేసి వట్టికాళ్ళ మాధవరావు తన కార్లోనే వుంచుకున్నట్లు మంగళవారం తెల్లవారుజామున తోటపల్లిగూడూరు మండలంలోని దేవల్లమిట్ట గ్రామంలో వున్న జ్వాలాముఖి అమ్మవారి ఆలయంలో చోరీ చేయుటకు అందరూ కలిసి కుట్ర పన్ని వస్తుండగా పోలీసులకు 7గురు పట్టుబడ్డారు. ఈ క్రమంలో మిగతా ఇద్దరు ముద్దాయిలను వారి ఇళ్ల వద్ద అరెస్టు చేసి వారి వద్దనున్న రెండు కలశాలూ, మొత్తం 5 కలశాలు (విలువ రూ.2లక్షల) దొంగతనానికి ఉపయోగించిన ఏపి16ఏజెడ్‌6199 నెంబర్ కలిగిన కారు (విలువ 10లక్షలు)ను స్వాధీనపరచుకున్నాము. ఈ కేసుని చేధించడంలో పాల్గొన్న పోలీసు సిబ్బంది మొత్తానికి నెల్లూరు జిల్లా ఎస్పి భాస్కర్ భూషణ్ రూరల్ డిఎసిపి రాఘవరెడ్డి అభినందనలు తెలియపరిచారు.



Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget