ముత్తుకూరు, డిసెంబర్ 29, (రవికిరణాలు) : కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం దేశంలోనే మంచి పేరు తెచ్చుకోవాలని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం కృష్ణపట్నం పోర్టును ముగ్గురు ఎంపీలు సందర్శించారు.ఈ సందర్భంగా ఎంపి మాట్లాడుతూ కృష్ణపట్నం పోర్టు తో మొదటి నుంచి తనకు ఎంతో అనుబంధం ఉందని గుర్తు చేశారు.ఇక్కడ అభివృద్ధి అంతా అడుగడుగునా చూశానని తెలిపారు. కృష్ణపట్నం పోర్టు చేసిన అభివృద్ధిని చూస్తే సంతోషం కలుగుతుందని తెలిపారు. కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం వృత్తి నైపుణ్యత కోసం ఎన్నో కోర్సులను ఏర్పాటు చేసి, ఎందరికో ఉపాధి కల్పించిందని ప్రశంసించారు.
అలాగే రక్షణ విషయంలోనూ ఎంతో క్రమశిక్షణ కలిగి మంచి ప్రమాణాలు పాటిస్తుందని కితాబునిచ్చారు. కోర్టు ద్వారా చుట్టుపక్కల ప్రాంతాలు ఎంతో అభివృద్ధి చెందాయని ప్రశంసించారు. ఉద్యోగ నియామకాల్లో కూడా ఎక్కడా ఎటువంటి వివాదాలు లేవని, అది యాజమాన్యం తీసుకున్న జాగర్తలు, చేసినటువంటి కృషి అని కొనియాడారు. అలాగే కృష్ణపట్నం పోర్టు వల్ల స్థానికులు ఎంతో మందికి ఉద్యోగాలు లభించాయని, ఎన్నో
కుటుంబాల్లో ఆనందం నిండిందని తెలిపారు. మున్ముందు ఈ పోర్టు ఇంకా ఎంతో అభివృద్ధి చెందాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎంపి బల్లి దుర్గాప్రసాద్, అనంతపురం ఎంపీ తలారి రంగయ్య లు కూడా పాల్గొని పోర్టు కార్యకలాపాలను ప్రశంసిస్టు మాట్లాడారు. అంతకుముందు ముగ్గురు ఎంపీలకు పోర్టు సీఈవో అనిల్ ఎండ్లూరి, ఎండి రాజేంద్ర ప్రసాద్, పిఆర్ ఓ వేణుగోపాల్, పోర్టు రక్షణ సిబ్బంది స్వాగతం పలికారు. ఆ తర్వాత ఓపెన్ టాప్ జీపులో ఎంపీలు ముగ్గురు రక్షణ సిబ్బంది కవాతును పరిశీలించారు. ఆ తర్వాత గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మహిళా రక్షణ సిబ్బంది, డాగ్ స్క్వాడ్ కూడా
పాల్గొన్నాయి. ముగ్గురు ఎంపీలు కలిసి పో ర్టు ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించారు. పోర్టులో రక్షణ ఏర్పాట్ల గురించి ఎండి రాజేంద్ర ప్రసాద్ వివరించారు. పోర్టును సందర్శించిన ప్రముఖుల ఛాయాచిత్రాలను కూడా వారికి చూపించారు.ముగ్గురు ఎంపీలు, విజయ డైరీ చైర్మన్ రంగా రెడ్డి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో విజయ డైరీ ఛైర్మన్ రంగారెడ్డి, స్వర్ణ వెంకయ్య, సుధాకర్ రెడ్డి, అబూబకర్, పాముల హరి, నరసింహారావు, డాక్టర్ సునీల్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం పోర్టు సందర్శన సాగింది. పోర్టు సీఈఓ అనిల్ ఎండ్లూరి పొర్టులొని సాంకేతికత,పరిశుభ్రత,మొక్కల పెంపకం,కమాండ్ కంట్రోల్ రూమ్ లను
చూపించి వివరించారు.
Post a Comment